వైసీపీ లీడర్స్ కు మాకు ఉన్న తేడా అదే, ఊరుఊరు తిరిగి చెబుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడం, ఆ సమావేశాలు పూర్తి కావడం జరిగిపోయింది. అసెంబ్లీ సమావేశాల మొదటిరోజు ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అందరితో ప్రమాణంస్వీకారం చేయించారు. శపథం చేసిమరి ముఖ్యమంత్రిగానే చంద్రబాబు నాయుడు సభలో అడుగుపెట్టారు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్న వైసీపీ నాయకులను చిత్తుచిత్తుగా ఓడించిన పవన్ కల్యాణ్ ఏకంగా డిప్యూటీ సీఎంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. నారా లోకేష్ కూడా మొదటిసారి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.
గతంలో వైసీపీ నాయకులతో నిండివున్న శాసనసభ ప్రస్తుతం పసుపుమయంగా మారింది. దీంతో అసలు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా? వస్తే ఆయన పరిస్థితి ఏమిటి? గతంలో మందబలంలో వైసీపీ నాయకులు చేసిన అవమానాలకు ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీలు రిపీట్ చేసి రివేంజ్ తీర్చుకుంటుందేమో? అనే అనుమానాలు అందరికి ఉండేవి. శాసన సభలో మాజీ సీఎం వైఎస్ జగన్ కు అవమానాలు తప్పవని అందరూ భావించారు.
కానీ అలాంటివేమీ లేకుండానే వైఎస్ జగన్ చాలా గౌరవంగా శాసనసభలోకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. శాసనసభ సమావేశాకు హాజరుకాకుండా జగన్ పులివెందుల వెళ్లిపోయారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు మాజీ సీఎం వైఎస్ జగన్ ను అవమానించేలా ఎక్కడా వ్యవహరించలేదు. అయితే ఇలా వైఎస్ జగన్ దక్కిన మర్యాదకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు కారణమంటూ అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ఇప్పుడే ఇదే విషయాన్ని టీడీపీ, జనసేన నాయకులు ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రచారం చేస్తున్నారు. వైసీపీకి, ఎన్డీఏ కూటిమికి ఉండే తేడా ఇదే అంటూ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ప్రజలకు చెబుతున్నారు. .
అసెంబ్లీ సమావేశాలు సమయంలో కొన్ని రూల్స్ పాటించాల్సి వుంటుంది. కానీ ఆ రూల్స్ ను పక్కనబెట్టి మరీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు తగిన గౌరవం దక్కేలా సీఎం చంద్రబాబు హుందాగా వ్యవహరించారని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పటికే చెప్పారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ హుందాగా వ్యవహరించడం వలనే వైఎస్ జగన్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రమాణస్వీకారం చేసుకొని వెళ్లిపోయారని టీడీపీ, జనసేన నాయకులు అంటున్నారు.
అసెంబ్లీ రూల్స్ ప్రకారం మొదట ముఖ్యమంత్రి, తర్వాత మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు పేరులోని మొదటి ఆంగ్ల అక్షరం ప్రకారం వరుసగా ప్రమాణస్వీకారం చేయాల్సి వుంటుంది. కాబట్టి ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడి హోదాకూడా లేదుకాబట్టి వైఎస్ జగన్ కు కూడా ఈ రూల్స్ వర్తిస్తాయి. కానీ వైఎస్ జగన్ కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ రూల్స్ బ్రేక్ చేసి జగన్ కు తగిన గౌరవం ఇచ్చారని అందువల్లే సీఎం, మంత్రుల తర్వాత జగన్ ప్రమాణస్వీకారం చేయగలిగారని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తెలిపారు.

ఇక వైఎస్ జగన్ అసెంబ్లీకి వచ్చే సమయంలోనూ అసెంబ్లీ రూల్స్ సడలించిన విషయం తెలిసిందే. కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష హోదా కలిగిన నాయకులు మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి కారులో వెళ్లవచ్చు. సాధారణ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీ గేటు బయటే కారుదిగి నడుచుకుంటూ రావాల్సివుంటుంది. ప్రస్తుతం వైసీపీకి ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లుకూడా రాలేదు.
వైఎస్ జగన్ కూడా సాధారణ ఎమ్మెల్యేగానే సభకు రావాల్సి వుంటుంది. కానీ జగన్ కారులోనే అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లారు. ఇందుకు కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ కారణమని టీడీపీ, జనసేన నాయకులు అంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతోనే వైఎస్ జగన్ కారును అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించారని టీడీపీ, జనసేన నాయకులు తెలిపారు.
చిన్నచిన్న విషయాలను పట్టించుకోవద్దని, మాజీ సీఎంగా జగన్ కు శాస సభలో తగిన గౌరవం ఇద్దామని చంద్రబాబు, పవన్ కల్యాణ్ సూచించినట్లు ఇప్పటికే మంత్రి పయ్యావుల తెలిపారు. కూటమి ఎమ్మెల్యేలను కూడా సభలో హుందాగా ప్రవర్తించాలని సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కల్యాణ్ సూచించారు. అందువల్లే జగన్ ప్రమాణస్వీకారం సాఫీగా సాగిందన్నారు.
జగన్ హోదా తగ్గించేలా వ్యవహరించవద్దన్న సీఎం, డీసీఎం ఆదేశాలతోనే టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో హుందాగా వ్యవహరించారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు, వైసీపీకి మాకు ఉన్నా తేడా అదే, మేము బూతులు మాట్లాడము, హుందాగా వ్యవహరిస్తాము అంటూ టీడీపీ, జనసేన నాయకులు ఇప్పుడు ఊరుఊరు తిరుగుతూ వైఎస్ జగన్, వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.
-
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా












Click it and Unblock the Notifications