గంటా శ్రీనివాసరావుకు టీడీపీ ,జనసేన షాక్

టికెట్ల అసమ్మతి కూటమిలో ఇంకా కొనసాగుతునే ఉంది. టికెట్ దక్కని నేతల్లో ఆగ్రహజ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ తుది జాబితాలో చోటు దక్కని నేతలు బహిరంగంగానే తమ అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్ కేటాయించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. గంటా శ్రీనివాసరావు నాయకత్వాన్ని స్థానిక టీడీపీ, జనసేన నాయకులు వ్యతిరేకిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన భీమిలి టికెట్ దక్కించుకున్నారు. అయితే తొలుత గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు గంటాకు సూచించారు. చీపురుపల్లి వైసీపీకి కంచుకోట కావడంతో గంటా చీపురుపల్లి నుంచి పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో గంటా సీటును చంద్రబాబు పెండింగ్‌లో ఉంచారు. ఒకనొక సమయంలో గంటాకు టీడీపీలో సీటు దక్కుతుందా లేదా అనుమానం కూడా వ్యక్తం అయింది.

TDP and Jana Sena leaders are against giving ticket to Ganta Srinivasa Rao

చివరికి గంటా ఒత్తిడికి తలొగ్గిన చంద్రబాబు ఆయనకు భీమిలి నియోజకవర్గం టికెట్‌ను కేటాయించారు.అయితే గంటాకు భీమిలి టికెట్ ఇవ్వడంపై కూటమిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.భీమిలి సీటు గంటాకు కేటాయించడంతో కూటమిలో అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. గంటాకు సీటు ఇవ్వడాన్ని టీడీపీ, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. భీమిలి నియోజకవర్గంలో చాలామంది స్థానిక నేతలు ఉన్నప్పటికీ వారిని కాదని వలస నేత అయిన గంటాకు ఎలా టికెట్ కేటాయిస్తారంటూ కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు.

దీనిలో భాగంగానే భీమిలి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ కోరాడ రాజాబాబు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నాలుగేళ్లుగా పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జనసేన నాయకులు కూడా గంటాకు టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. గంటాకు సహకరించేది లేదని.. అభ్యర్థిని మార్చాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. భీమిలి టికెట్‌పై టీడీపీ, జనసేన స్థానిక నేతలు ఆశలు పెట్టుకోగా, ఆ స్థానాన్ని గంటా దక్కించుకోవడంతో స్థానిక నేతల్లో అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+