కూటమిలో కల్లోలం: టీడీపీ, జనసేనకు సీనియర్లు గుడ్‌బై

TDP Janasena BJP alliance: వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి తెలుగుదేశం పార్టీ.. జనసేన, భారతీయ జనతా పార్టీతో కట్టిన కూటమి ప్రభావం సీనియర్లకు టికెట్లు లేకుండా చేస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ వచ్చిన నాయకులు పొత్తుల వల్ల సీట్లు, టికెట్లను కోల్పోవాల్సి వస్తోంది.

టీడీపీ, జనసేనకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, ఆశావహులు, మాజీ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్నారు. శివరామరాజు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, కే అప్పల్నాయుడు, యనమల కృష్ణుడు, కేఎస్ జవహర్, జేడీ రాజశేఖర్, పోతిన మహేష్.. వంటి నాయకులు తిరుగుబాటు బాట పట్టారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్నారు.

TDP and Janasena leaders Gopal Yadav and Ganta Narahari joined in YSRCP

ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత, ఏలూరు లోక్‌సభ మాజీ సభ్యుడు మాగంటి బాబు పేరు సైతం వినిపిస్తోంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయనకు టికెట్ దక్కని విషయం తెలిసిందే. ఏలూరు లోక్‌సభ టికెట్‌ను మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి అల్లుడు, కడప జిల్లా మైదుకూరు అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్‌ రెండో కొడుకు పుట్టా మహేష్ యాదవ్‌కు ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

అదే ఏలూరు టికెట్ వ్యవహారం టీడీపీలో చిచ్చు పెట్టింది. ఏలూరు లోక్‌సభ ఇన్‌ఛార్జీ జీ గోపాల్ యాదవ్.. టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఇన్ని సంవత్సరాలుగా తాను ఇన్‌ఛార్జీగా టీడీపీని బలోపేతం చేయడానికి ఎంతో కష్టపడ్డానని, ఆర్థికంగా నష్టపోయానని అన్నారు. టికెట్ దక్కుతుందనే ఉద్దేశంతో అన్నీ భరించానని అన్నారు.

TDP and Janasena leaders Gopal Yadav and Ganta Narahari joined in YSRCP

ఇప్పుడు తనకు కాకుండా కడప జిల్లా నుంచి తెచ్చుకున్న నాయకుడికి ఏలూరు లోక్‌సభ టికెట్ ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. అనంతరం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయన చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకొన్నారు.

అదే సమయంలో అన్నమయ్య రాయచోటి జిల్లాకు చెందిన జనసేన సీనియర్ నాయకుడు, రాజంపేట లోక్‌సభ లోక్‌సభ ఇన్‌ఛార్జీ గంటా నరహరి కూడా పార్టీకి రాజీనామా చేశారు. పొత్తులో భాగంగా రాజంపేట లోక్‌సభ టికెట‌్‌‌ను భారతీయ జనతా పార్టీ దక్కించుకున్న విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+