ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి వచ్చే సీట్లివే..!!

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ ఫలితాలతో సీఎం జగన్ తీరులోనూ మార్పు వచ్చిందని టీడీపీ ముఖ్య నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రం గతంలో చేసిన విధంగా హెచ్చరికలు కాకుండా, బతిమాలుకుంటున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే టీడీపీ తొలి విజయంగా అభివర్ణించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 160 స్ధానాలు గెలుచుకోవడం ఖాయమని అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏపీలో జగన్ ఇక అధికారంలో ఉండేది ఎనిమిది నెలలేనని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో ప్రజల్లో ఆశలు కల్పించి మోసం చేసారని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ లేకుండా చేయాలని అనేక ప్రయత్నాలు చేసారని..కానీ, పార్టీ కేడర ధైర్యంగా నిలబడిందని..దేనికి లొంగలేదని పేర్కొన్నారు.

atchamnaidu

ఏపీని గాడిలో పెట్టగలిగే బాధ్యత టీడీపీ తీసుకుంటుందన్నారు. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ సిద్దంగా ఉందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ లాగా టీడీపీ గాలిలో పుట్టిన పార్టీ కాదని.. బలమైన యంత్రాంగం ఉందని వివరించారు. సంపదను సృష్టించి పేదలకు పంచాలని.. కేవలం బటన్ నొక్కడం గొప్పతనం కాదన్నారు.

ఎమ్మెల్యేలను జగన్ బతిమలాడుకొనే స్థాయికి వచ్చారని అచ్చెన్న ఎద్దేవా చేసారు. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ రాజధానిగా కోరుకోవడం లేదని.. వెనుకబాటు తనాన్ని దూరం చేయాలని కోరుకుంటున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు మరింత భాధ్యతను పెంచిందన్నారు.

గతంలో అభివృద్ధి మీదే దృష్టి పెట్టి పార్టీ నేతలను పట్టించు కాలేదని.. ఈసారి కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. విశాఖలో టీడీపీ ప్రాంతీయ సదస్సు జరుగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు రానున్న ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+