జూ ఎన్టీఆర్ మౌనం పై అచ్చెన్న కీలక వ్యాఖ్యలు..!!
రాష్ట్రంలో చంద్రబాబు అరెస్ట్ తో రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటోంది. చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. బెయిల్ పిటీషన్ పైన ఈ నెల 19న విచారణ జరగనుంది. ఇదే సమయంలో లోకేశ్ ఢిల్లీ వెళ్లారు. ఇటు టీడీపీ చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే, ఇప్పటి వరకు చంద్రబాబు అరెస్ట్ పై జూ ఎన్టీఆర్ స్పందించలేదు. తారక్ మౌనం పైన అచ్చెన్నాయుడు స్పందించారు.
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పైన టీడీపీ నిరసనలు కొనసాగిస్తోంది. నారా, నందమూరి కుటుంబాల నుంచి చంద్రబాబు అరెస్ట్ పైన ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయితే, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు చంద్రబాబు అరెస్ట్ పైన స్పందించలేదు. దీని పైన సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఇదే అంశం పైన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. జూనియర్ ఎన్ఠీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయన్ని అడగాలంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎవరినీ స్పందించమని తాము అడగమని స్పష్టం చేసారు. సంబంధం లేని కేసులో ఇరికించారని ఆరోపించారు. హైదరాబాద్ లో విజయవాడలో స్వచ్ఛందంగా ఆందోళనలకు దిగారని చెప్పుకొచ్చారు.

కొంత కాలంగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలకు జూ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడకలకు హాజరు కాలేదు. దుబాయ్‌లో జరగనుతున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా)అవార్డుల వేడుకల్లో ఆయన ఫ్యామిలీతో కలిసి హాజరయ్యారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన జూ ఎన్టీఆర్ స్పందించరా అంటూ కొందరు టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే, గతంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల సమయంలో కొందరు టీడీపీ నేతలు జూ ఎన్టీఆర్ పైన చేసిన వ్యాఖ్యల పైన తారక్ అభిమానులు మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు జూనియర్ గుర్తు రాడు, అదే టీడీపీ అధికారంలో లేనప్పుడు మాత్రం ఆయన కావాల్సివచ్చాడా అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి.
2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2014 ఎన్నికల తరువాత టీడీపీ అధికారంలోకి వచ్చినా జూ ఎన్టీఆర్ కు ఎక్కడా ప్రాధాన్యత లేదు. అప్పటి నుంచి పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూ ఎన్టీఆర్..తన సినిమాల పైనే ఫోకస్ చేసారు. రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటున్నారు. ఇక, ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ వేళ జూ ఎన్టీఆర్ మౌనం పైన అటు టీడీపీ మద్దతు దారులు..ఇటు జూ ఎన్టీఆర్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక, తాజాగా అచ్చెన్నాయుడు వ్యాఖ్యల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications