జడ్జీ రామకృష్ణ సోదరుడిపై దాడి: నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసిన టీడీపీ..
జడ్జీ రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి కలకలం రేపింది. అయితే దాడి చేసింది వైసీపీ శ్రేణులేనని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. అయితే దీనిపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. మదనపల్లెలో చికిత్స పొందుతున్న రామచంద్రను నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు పరామర్శించారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నేత కళా వెంకట్రావు మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుందని పేర్కొన్నారు. ఈ సమయంలో 152కి పైగా దాడులు జరిగాయని అన్నారు. జడ్జీ కుటుంబ సభ్యులనే వేధిస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని కళా వెంకట్రావు ప్రశ్నించారు.

చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన దళిత జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రపై కొందరు దుండగులు ఆదివారం దాడిచేశారు. బి.కొత్తకోట మండలం సూరపవారిపల్లెకు చెందిన కుమార్, ఆయన అనుచరులు కలసి తనపై దాడిచేశారని రామచంద్ర తెలిపారు. బి.కొత్తకోట బస్టాండులో పండ్లు కొనుగోలు చేస్తుండగా కర్ణాటక రిజిస్ట్రేషన్ గల కారులో వచ్చి.. దాడిచేశారన్నారు. వారితో తనకు గతంలో ఎలాంటి గొడవలు లేవని చెప్పారు.
తీవ్రంగా గాయపడిన రామచంద్రను స్థానికులు చికిత్స నిమిత్తం బి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులకు, తమ కుటుంబానికి మధ్య ఇటీవల జరుగుతున్న భూవివాదాలే దాడికి కారణమని జడ్జి రామకృష్ణ ఆరోపించారు. స్థానిక వైసీపీ నాయకులు తన తమ్ముడిపై హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications