ఎన్టీఆర్-కల్యాణ్ రామ్ సినిమాలను బ్యాన్ చేసిన టీడీపీ..?
కల్యాణ్ రామ్ 'డెవిల్' సినిమాను ఓ వర్గం బహిష్కరించిందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. టీడీపీ శ్రేణులు 'డెవిల్' సినిమాకు దూరంగా ఉంటున్నాయి. దీంతో కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఇటీవల కల్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణంగా తెలుస్తుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కల్యాణ్ రామ్ కొత్తగా నటించిన చిత్రం డెవిల్.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కల్యాణ్ రామ్‌కు ఏపీ రాజకీయాల గురించి ఊహించని ప్రశ్న ఎదురైంది. వచ్చే ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి ఉంటుందనే ప్రశ్నపై ఆయన ఆచితూచి స్పందించారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనేది తన ఒక్కడి నిర్ణయం మీద ఆధారపడి ఉండదని కల్యాణ్ రామ్ తెలిపారు. కుటుంబం అంతా కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు.

తాను గానీ, జూనియర్ ఎన్టీఆర్ గానీ వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. నాన్న హరికృష్ణ లేకపోవడం వల్ల తామే కుటుంబ పెద్దగా ఉంటోన్నామని, తాను, తారక్ ఇద్దరం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని కల్యాణ్ రామ్ అన్నారు.
టీడీపీ వారి తాతగారి స్థాపించిన పార్టీ కాబట్టి ఆ పార్టీకే మద్దతుగా ఉంటారని అందరూ భావించారు. కానీ కల్యాణ్ రామ్ దీనికి విరుద్దంగా ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో తమ్ముడు ఎన్టీఆర్ , నేను చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో..టీడీపీకి గట్టి షాక్ ఇచ్చినట్టు అయింది. కల్యాణ్ రామ్ మాట్లాడిన వీడియోను వైసీపీ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది.
ఈ పరిణమాలను నిశితంగా గమనించిన టీడీపీ అగ్ర నాయకత్వం.. కల్యాణ్ రామ్ డెవిల్ సినిమాకు దూరంగా ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది. దీంతో బాలకృష్ణ అభిమానులు డెవిల్ సినిమాను బ్యాన్ చేశారని తెలుస్తోంది. టీడీపీ సోషల్ మీడియాలో కూడా డెవిల్ సినిమాను చూడొద్దంటూ పోస్టులు దర్శనం ఇచ్చాయి.

దీని కారణంగానే 'డెవిల్' సినిమా బాగుందని టాక్ వచ్చినప్పటికీ..కలెక్షన్లు మాత్రం అనుకున్నంత స్థాయిలో రాలేదనే చర్చ జరుగుతుంది. భవిష్యత్తులో ఎన్టీఆర్‌కు సైతం ఈ సమస్య తప్పకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి దీనిపై నందమూరి బ్రదర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications