టీడీపీ ఆపరేషన్ పుంగనూరు- టార్గెట్ పెద్దిరెడ్డి, ఢిల్లీకి సీన్ ఛేంజ్..!!
ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తరువాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాల పేర్ల మార్పుతో సహా పాలనా పరంగా ప్రక్షాళన ప్రారంభించారు. రాజకీయంగానూ చోటు చేసుకున్న ఘటనల పైన ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో గత అయిదేళ్ల కాలంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్న పరిణామాలకు సమాధానంగా టీడీపీ ఆపరేషన్ పుంగనూరు మొదలు పెట్టింది.
టీడీపీ ఆపరేషన్ షురూ
వైసీపీ హాయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రభుత్వంలో..చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబు లక్ష్యంగా వ్యూహాలు అమలు చేసారు. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెద్దిరెడ్డి నియోజకవర్గం పై టీడీపీ ఫోకస్ చేసింది. పుంగనూరులో పార్టీ ప్రాబల్యం పెంచుకొనేలా అడుగులు వస్తోంది. ఇటీవల పుంగనూరు మున్సిపాల్టీకి సంబంధించి చైర్మన్ సహా 13మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో పుంగనూరు రాజకీయం వేడెక్కింది. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పుంగనూరు పర్యటన ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడింది.

మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్
తాజాగా స్థానిక నేతల్ని కలిసేందుకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు వెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన అక్కడికి వెళ్తే శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని పోలీసులు చెబుతున్నారు. మిథున్ రెడ్డిని పుంగనూరు వెళ్లకుండా అడ్డుకున్నారు. తిరుపతిలో ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నేతలు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని, వైసీపీ కార్యకర్తల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఎంపీ మిథున్ రెడ్డి. బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

మిథున్ కీలక వ్యాఖ్యలు
ఒక ఎంపీగా తన నియోజకవర్గ ప్రజల్ని కలిసే హక్కు తనకు లేదా అని ప్రశ్నించారు. తనను అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారని, దీనిపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని మిథున్ రెడ్డి చెప్పారు. పుంగనూరు లో ఎప్పుడు లేని కొత్త సంస్కృతికి తెర లేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. జేసిబీలు తెచ్చి పేదల ఇల్లు కులదోస్తున్నారని ఆరోపించారు. పేదల ఇళ్లపై దాడులు చేయడం దారుణమని పేర్కొన్నారు. తమ వారిని ప్రరామర్శించడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారన్నారు. తాను అరెస్టుకైన, ప్రణ త్యాగానికైనా సిద్ధం గా ఉన్నానంటూ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.












Click it and Unblock the Notifications