లోకేష్ పర్యటనలో గాయపడిన అభ్యర్థి మాగంటి బాబు

TDP candidate Maganti Babu injured
ఏలూరు: ఏలూరు లోక్‌సభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగంటి బాబు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయనను మెరుగైన చికిత్స కోసం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం రాత్రి చేర్చారు. ఆదివారం రాత్రి జంగారెడ్డిగూడెంలో నారా లోకేశ్ పర్యటన సందర్భంగా కార్యకర్తలను ముందుకు కదిల్చే క్రమంలో బైక్‌పై ప్రయాణిస్తూ మాగంటి కింద పడ్డారు. దీంతో తలకు, కుడి మోచేతికి గాయాలయ్యాయి.

దాన్ని కూడా లెక్కచేయకుండా ఆయన ఆదివారం ఆసాంతం లోకేశ్‌తోనే ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం నాటికి గాయాల తీవ్రత పెరగడంతో ఆయనను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గాయాలను మాగంటి తేలిగ్గా తీసుకున్నా కుటుంబ సభ్యులు, నాయకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 15 ఏళ్ల కిందట మాగంటికి తుంటి భాగంలో శస్త్ర చికిత్స జరిగిందని, ఇపుడు అది కూడా తిరగబెట్టిందని వైద్యులు తెలిపారు.

ఇదిలావుంటే, మెదక్ జిల్లా గజ్వేల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి సోదరుడు, మండల టిడిపి అధ్యక్షుడు వంటేరు శ్రీనివాస్‌రెడ్డికి సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. గజ్వేల్‌లో జరిగిన చంద్రబాబు సభలో శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

అనంతరం తిరుగు ప్రయాణమవుతుండగా మండలంలో రాంనగర్ వద్ద కారు బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాస్‌రెడ్డితోపాటు మరో టిడిపి నాయకుడు రమేశ్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+