కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిజెపికి షాక్: టిడిపి అభ్యర్థుల నామినేషన్లు దాఖలు

By Pratap
|
Google Oneindia TeluguNews

TDP candidates file nominations in BJP seats
హైదరాబాద్: పొత్తు పంచాయతీ ముగిసిన 24 గంటల లోపే తెలుగుదేశం పార్టీ సీమాంధ్రలో బిజెపికి షాక్ ఇచ్చింది. బిజెపికి కేటాయించిన నాలుగు సీట్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు అభ్యర్థులు మాత్రం టిడిపి బీ ఫారాలతో నామినేషన్లు వేశారు. కడప, సంతనూతలపాడు శాసనసభా స్థానాలకు టిడిపి అభ్యర్థులు బీ ఫారాలతో నామినేషన్లు దాఖలు చేశారు.

సీమాంధ్రలో శనివారం నామినేషన్ల గడువు ముగిసింది. శనివారంనాడు పెద్ద యెత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. కడప శాసనసభా నియోజకవర్గం నుంచి దుర్గాప్రసాద రావు టిడిపి బీ ఫారంతో నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై బిజెపి నాయుకుడ హరినాథ్ రెడ్డి తీవ్రంగా మండిపడుతున్నారు. పొత్తు ఒప్పందాన్ని తెలుగుదేశం పార్టీ ఉల్లంఘించడమేనని ఆయన విమర్శించారు.

దుర్గాప్రసాద్ వెంటనే నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ నాయకత్వం సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. కాగా, సంతనూతలపాడు శాసనసభా నియోజకవర్గానికి విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ బీ ఫారంతో నామినేషన్ వేశారు.

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్లతో బిజెపి నాయకులు అయోమయంలో పడ్డారు. అయితే, నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది కదా అని ఓ వైపు అంటూనే మరోవైపు బిజెపి అభ్యర్థులు బలహీనంగా ఉన్నచోట్లనే నామినేషన్లు వేశామని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. సీమాంధ్రలో బిజెపికి తెలుగుదేశం పార్టీ కేవలం 13 సీట్లు మాత్రమే కేటాయించింది. సీమాంధ్రలో మొత్తం 175 శాసనసభా స్థానాలున్నాయి.

English summary
Giving a shock to BJP, Telugudesam party candidates have filed nominations for Kadapa and Santhanuthalapadu assembly segments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X