రేపు వైజాగ్ లో చంద్రబాబు కీలక డాక్యుమెంట్ రిలీజ్ -ఇండియా విజన్-2047 పేరుతో..
ఈసారి పంద్రాగస్టు వేడుకల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కీలక డాక్యుమెంట్ విడుదల చేయబోతున్నారు. భారత్ ను గ్లోబల్ లీడర్ గా నిలిపేందుకు వీలుగా జీఎఫ్ఎస్టీ అనే సంస్ధ రూపొందించిన ఈ డాక్యుమెంట్ ను చంద్రబాబు వైజాగ్ లో ఆవిష్కరిస్తారు. ఐదు వ్యూహాల ద్వారా 2047 నాటికి భారత్ ను గ్లోబల్ లీడర్ గా నిలపడం ఎలా అన్న దానిపై అధ్యయనం చేసి జీఎఫ్ఎస్టీ సంస్ధ ఈ డాక్యుమెంట్ ను తయారు చేసింది.
వైజాగ్ లో ఆగస్ట్ 15 తేదీ ఇండియా విజన్ -2047 డాక్యుమెంట్ విడుదల చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఫైవ్ స్ట్రాటజీస్ ఫర్ ఇండియా యాజ్ గ్లోబల్ లీడర్ పేరుతో తయారైన ఈ విజన్ డాక్యుమెంట్ ను చంద్రబాబు విడుదల చేస్తారు. ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పన పై గత కొద్ది నెలలుగా GFST బృందం పనిచేస్తోంది. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయిన్బుల్ ట్రాన్స్ఫర్మేషన్ చైర్మన్ (జీఎఫ్ఎస్టీకి) గా చంద్రబాబు ప్రస్తుతం ఉన్నారు.

మేధావులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఉన్నత విద్యావంతులు, పలు రంగాల నిపుణుల సమక్షం లో వైజాగ్ లో చంద్రబాబుఈ విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్నారు. డాక్యుమెంట్ పై అన్ని వర్గాల సూచనలను ఈ సందర్భంగా GFST స్వీకరించనుంది. ఇందుకోసం అందరినీ డాక్యుమెంట్ రిలీజ్ కు ఆహ్వానిస్తున్నారు. పార్టీలు, గ్రూపులకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు.
మూడేళ్ల క్రితం ఏర్పాటైన గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే సంస్థ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్‌గా పనిచేస్తోంది. ఈ సంస్థకు టీడీపీ అధినేత చంద్రబాబు చైర్మన్‌గా ఉన్నారు. దీనిలో ఆర్థిక రంగ నిపుణులు, పర్యావరణ వేత్తలు, రిటైర్డ్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పని చేసిన అధికారులు, కార్పొరేట్ ప్రముఖులు, విద్య, వైద్య, న్యాయ, మీడియా రంగ నిపుణులు, కార్పొరేట్ రంగ వ్యక్తులు ఉన్నారు.
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా... తెలుగుజాతి భవితవ్యాన్ని తీర్చిదిద్ధేందుకు... 2047 నాటికి దేశాన్ని గ్లోబల్ లీడర్ గా మలిచే వ్యూహాలపై చర్చించేందుకు... తనతో కలిసి రావాలని యువతను , మేధావులను ఆహ్వానిస్తున్నారు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు గారు.
— Telugu Desam Party (@JaiTDP) August 14, 2023
తనతో కలిసి పాదయాత్రలో… pic.twitter.com/2DhKcRPv5A
పాలసీల రూపకల్పన, రీసెర్చ్, నాలెడ్జ్ షేరింగ్ అనే అంశాలకు జిఎఫ్ఎస్టి వేదికగా పనిచేస్తోంది. మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగం, లాజిస్టిక్స్, తయారీ పరిశ్రమల, MSME పరిశ్రమలు, టెక్నాలజీ, ఎనర్జీ, స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్, వాతావరణ మార్పులు, ప్రజా ఆరోగ్యం వంటి అంశాలపై జిఎఫ్ఎస్‌టి పని చేస్తుంది.
భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తి చేసుకునే 2047 నాటికి ప్రపంచ నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా రూపొందే అవకాశం ఉంది. దీనిలో భాగంగా స్ట్రాటజీస్ ఫర్ ఇండియా@100 అనే కాన్సెప్ట్‌పై జిఎఫ్ఎస్టి పనిచేస్తుంది. ఆయా రంగాల నిపుణులు, విద్యావేత్తలు, సంస్థలు, వ్యక్తుల భాగస్వామ్యంతో GFST నివేదికలు సిద్దం చేస్తోంది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications