అసెంబ్లీ వద్ద చంద్రబాబు నిరసన :మెడలో ఉల్లి దండలతో ఆందోళన: అడ్డుకున్న పోలీసులు..!

Recommended Video

    AP Assembly Winter Sessions 2019 : Chandrababu Naidu Held Samme Against Onion Price Hike

    అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆందోళనతో మొదలైంది. సమావేశాల తొలి రోజున టీడీపీ ఏపీలో ఉల్లి ధరలు..కొరతతో పాటుగా నిత్యావసరాల పైన వాయిదా తీర్మానం ఇచ్చింది. అదే విధంగా సమావేశాలకు హాజరయ్యే ముందు పార్టీ అధినేత చంద్రబాబు తో సహా పార్టీ ఎమ్మెల్యేలు ..ఎమ్మెల్సీలు వెంకటాయపాలెం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు.

    అక్కడ నుండి అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ ఎదుట టీడీపీ నేతలు ధర్న చేసారు. పార్టీ అధినేత చంద్రబాబు సైతం ఆ ధర్నాలో పాల్గొన్నారు. ఉల్లి ధరలను నియంత్రించటంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. దీని పైన సభలోనే ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేసారు.

    TDP chief CBN protest in front of Assembly against govt failure in control onion rates

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ రోజు నుండి ప్రారంభం కానన్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తొలి రోజు నుండే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని టీడీపీ భావిస్తోంది. అందులో బాగంగా ప్రస్తుతం అధికంగా ఉన్న ఉల్లితో పాటుగా నిత్యావసరాల ధరల పైన ఆందోళనకు దిగింది. సభలో తొలి రోజునే ఇదే అంశం పైన వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇక, సభలో దీని పైన పట్టుబట్టాలని నిర్ణయించింది. ఇక, వెంకటాయ పాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించి..అక్కడ నుండి అసెంబ్లీకి చేరుకున్నారు.

    మెడలో ఉల్లి దండలతో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేసారు. ఉల్లి ధరలు బంగారం కంటే ప్రియంగా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. తమ ప్రభుత్వ హాయంలో ధరలు పెరిగిన సమయంలో రేషన్ షాపుల ద్వారా అందించామని గుర్తు చేసారు. ఇది చేతకాని ప్రభుత్వమంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. అయితే, ఉల్లిపాయలతో అసెంబ్లీ లోపలకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. తమ పార్టీ కార్యాలయంలో పెడతామని..సభలోకి తీసుకెళ్లమని చెప్పి ఎమ్మెల్యేలు లోపలకు వెళ్లారు. ఆ సమయంలో పోలీసులు..టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+