Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మీ ప్రత్యర్దులు బలవంతులు, తట్టుకోలేరేమో - సునీతకు చంద్రబాబు అలర్ట్..!!

ఏపీలో ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. సీఎం జగన్ చేస్తున్న పార్టీ అభ్యర్దుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. టీడీపీ, జనసేన అభ్యర్దులను ప్రకటిస్తారని భావిస్తున్న వేళ బీజేపీతో పొత్తు ఖాయమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి కేటాయించినట్లు సీట్ల పైన చర్చ జరుగుతోంది. ఈ సమయంలో టీడీపీ నుంచి ఖాయంగా పోటీ చేసే వారి సీట్ల పైన చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా పరిటాల కుటుంబానికి సీట్ల పైన స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.

మారుతున్న లెక్కలు: వచ్చే ఎన్నికల్లో పొత్తుల లెక్కలతో చంద్రబాబు ప్రతీ సీటు విషయంలోనూ ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనసేనకు 25-27 సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. బీజేపీతో పొత్తు అధికారికం అయితే ఆ పార్టీకి 10-12 సీట్ల వరకు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో, టీడీపీ నుంచి సీట్లు ఆశిస్తున్న వారు చంద్రబాబు పైన ఒత్తిడి పెంచుతున్నారు.

TDP Chief Chandra Babu alerts paritla Sunitha for next Elections over YSRCP strategies

దీంతో, ఈ ఎన్నికల్లో సీనియర్ల నుంచి ఒత్తిడి వచ్చినా ఒక్కో కుటుంబానికి ఒక్క సీటు మాత్రమే కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగా అనంతపురం జిల్లాలో పరిటాల, జేసీ కుటుంబాలకు ఇదే విషయం స్పష్టం చేసారు. అయితే, తాజాగా పరిటాల సునీత తన కుమారుడు శ్రీరామ్ తో కలిసి పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు.

చంద్రబాబు క్లారిటీ: తమ కుటుంబానికి రాప్తాడుతో పాటుగా ధర్మవరం సీటు కేటాయించాలని మరోసారి చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. రాప్తాడు నుంచి పరిటాల సునీత, ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్ సీట్లు ఆశిస్తున్నారు. ఇప్పటికే దర్మవరంలో మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఈ సారి ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నారు. ప్రస్తుతం ధర్మవరం లో సీట్ల విషయంలో పోటీ తారా స్థాయికి చేరింది.

ఇక, తాజాగా సునీత అమరావతిలో చంద్రబాబును కలిసిన సమయంలో సీట్ల అంశం చర్చకు వచ్చింది. ఆ సమయంలో "మీ కుటుంబానికి రెండు అసెంబ్లీ సీట్లు అడుతున్నారు కానీ, ఈ రండు చోట్లా మీ ప్రత్యర్ధులు ఆర్దికంగా బలవంతుు. మీరు రెండు స్థానాల్లో పోటీ చేస్తే ఆర్దికంగా తట్టుకోలేరేమో..ఆలోచించండి.." అంటూ చంద్రబాబు కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది.

పొత్తులు - సీట్లు: చంద్రబాబు ఇప్పటికే కోట్ల, జేసీ, కేఈ, అయ్యన్న పాత్రుడు కుటుంబాలకు ఒక్క సీటు ఇస్తున్నట్లు తేల్చి చెప్పారు. ఇప్పుడు పరిటాల కుటుంబం విషయంలో నిర్ణయం మార్చుకుంటే ఇతర సీనియర్ల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

దీంతో, ఇదే విషయం చంద్రబాబు తాజా భేటీలో సునీతకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక, జనసేన తో పాటుగా బీజేపీ కి సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి కనిపిస్తుండటంతో టీడీపీలో ఎవరికి సీట్లు దక్కుతాయి..ఎవరి సీట్లు గల్లంతు అవుతాయనే చర్చ పార్టీలో ఆశావాహుల్లో మొదలైంది. వచ్చే వారం మొత్తం పొత్తులతో పాటుగా సీట్ల పైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+