Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గన్నవరం టీడీపీ బాధ్యతల పై చంద్రబాబు కీలక నిర్ణయం..!?

గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్దిగా బరిలో నిలిచేదెవరనే చర్చ నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

గన్నవరం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. నాలుగు రోజుల క్రితం గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి..జరిగిన రాజకీయ రగడతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఇక్కడ నుంచి 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీకి దగ్గరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు..లోకేష్ లక్ష్యంగా వంశీ సందర్బం వచ్చిన ప్రతీ సందర్భంలోనూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే సమయంలో గన్నవరంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యం. ఇప్పటి వరకు గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్దిగా బరిలో నిలిచేదెవరనే అంశంలో పలువురి పేర్లు తెర మీదకు వచ్చాయి. కానీ, ఇప్పుడు చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

వల్లభేనేని వంశీ లక్ష్యంగా టీడీపీ

వల్లభేనేని వంశీ లక్ష్యంగా టీడీపీ

గన్నవరం ఎమ్మెల్యే వంశీ వైసీపీకి దగ్గరైన తరువాత అధికార వైసీపీ నేతలు అక్కడ వ్యతిరేకంగా మారారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు, సీనియర్ నేత దుట్టా రామచంద్ర రావు నియోజకవర్గంలో వంశీని వ్యతిరేకిస్తున్నారు. కానీ, వైసీపీ అధినాయకత్వ మాత్రం వచ్చే ఎన్నికల్లో వంశీ పార్టీ అభ్యర్ధిగా బరిలో ఉంటారని ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. అటు వంశీ వచ్చే ఎన్నికల కోసం కసరత్తు ఇప్పటికే ప్రారంభించారు. అటు టీడీపీ నేతలు తనను లక్ష్యంగా చేస్తున్న విమర్శలకు వంశీ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. టీడీపీ వర్సస్ వంశీ మధ్య జరిగిన సవాళ్లు ఘర్షణకు దారి తీసాయి. ఇదే సమయంలో గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్ది ఎవరనే చర్చ మొదలైంది. పట్టాభి టీడీపీ అభ్యర్ధిగా గన్నవరం నుంచి పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారమూ సాగింది. ఈ సమయంలోనే చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

గన్నవరం పై చంద్రబాబు నిర్ణయం

గన్నవరం పై చంద్రబాబు నిర్ణయం

గన్నవరంలో తాజాగా చంద్రబాబు పర్యటించారు. దాడి జరిగిన పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. నియోజకవర్గ ఇంఛార్జ్ గా బచ్చుల అర్జునుడుకు అప్పగించారు. ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకున్నారు. గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా మాజీ ఎంపి కొనకళ్ల నారాయణను నియమించారు. కమీటి సభ్యులుగా బచ్చుల సుబ్రహ్మణ్యం, జాస్తి వెంకటేశ్వరరావులను నియమించారు. కొనకళ్ల నారాయణ వరుసగా రెండు సార్లు మచిలీపట్నం నుంచి ఎంపీగా గెలుపొందారు. బీసీ వర్గానికి చెందిన నారాయణకు ఇప్పుడు కో ఆర్డినేటర్ హోదాలో నియోజకవర్గ బాధ్యతలుఅప్పగించారు. 2009, 2014 ఎన్నికల్లో నారాయణ టీడీపీ ఎంపీగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన వల్లభనేని బాలశౌరి చేతిలో నారాయణ ఓడిపోయారు. ఇప్పుడు నారాయణను గన్నవరం కో ఆర్డినేటర్ గా నియమించటం ద్వారా చంద్రబాబు ఆలోచనల పైన కొత్త చర్చ మొదలైంది.

గన్నవరం లో గెలుపెవరిది

గన్నవరం లో గెలుపెవరిది

ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో గుడివాడ - గన్నవరం నియోజకవర్గాల్లో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలవాలనేది చంద్రబాబు లక్ష్యం. అదే సమయంలో రెండు సీట్లలో వైసీపీ అభ్యర్ధులుగా ఇప్పటికే మాజీ మంత్రి కొడాలి నాని..వంశీ ఖరారయ్యారు. ఇద్దరూ తమ గెలుపు పైన ధీమాతో ఉన్నారు. కానీ, ఈ రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్ధుల పైన స్పష్టత లేదు. పలువురి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. గన్నవరం నుంచి ముగ్గురు సీనియర్ నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. టీడీపీ - జనసేన పొత్తు తో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ తమదే పై చేయి అవుతుందని టీడీపీ భావిస్తోంది. ఇటు వైసీపీ కూడా కొడాలి నాని - వంశీలను గెలిపించుకోవటం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. దీంతో..ఇప్పుడు చంద్రబాబు నిర్ణయం కీలకంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+