సీఎం జగన్ వైనాట్ కుప్పం - 35 ఏళ్ల తరువాత, చంద్రబాబు శ్రీకారం..!!
కుప్పం నియోజకవర్గం టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాకా. కుప్పం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న చంద్రబాబు తాజాగా అక్కడ ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించారు. దీని కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసారు. ప్రభుత్వం అనుమతులు ఇవ్వటం లేదని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఎట్టకేలకు చంద్రబాబు ఇంటి నిర్మాణం ప్రారంభించారు. వై నాట్ కుప్పం అంటూ ధీమా వ్యక్తం చేసారు. ఈ సమయంలో తాజాగా ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు.
కుప్పంలో చంద్రబాబు ఇల్లు:కుప్పం గడ్డ చంద్రబాబు అడ్డా. ఇదీ టీటీపీ నేతల స్లోగన్. కాదు, వై నాట్ 17..వై నాట్ కుప్పం. ఇదీ సీఎం జగన్ తో సహా వైసీపీ నేతల నినాదం. 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మాత్రమే గెలిచారు. ఈ సారి కుప్పంలోనూ వైసీపీ జెండా ఎగురుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎమ్మెల్సీ భరత్ ను సీఎం జగన్ అభ్యర్ధిగా ఖరారు చేసారు. కుప్పంలో స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది.

నియోకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ప్రతీ మూడు నెలలకోసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు అన్ని వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
వైసీపీ వై నాట్ కుప్పం:కుప్పంలో ఇంఛార్జ్ గా ఎమ్మెల్సీ శ్రీకాంత్ కు బాధ్యతలు అప్పగించారు. వైసీపీ ప్రభుత్వం జిల్లా పునర్విభజన నియోజకవర్గాల సమయంలో కుప్పంను రెవిన్యూ డివిజన్ గా అప్ గ్రేడ్ చేయాలని చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాసారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం జగన్ అసెంబ్లీలో వెల్లడించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి తన నియోజకవర్గాన్ని రెవిన్యూ డివిజన్ గా చేయలేకపోయారని ఎద్దేవా చేసారు.
కుప్పం ను ప్రభుత్వం రెవిన్యూ డివిజన్ గా ప్రకటించింది. కుప్పంలో చంద్రబాబు సొంతిటి నిర్మాణానాకి నిర్ణయించారు. దీనికి సంబంధించి అనుమతుల విషయంలో రాజకీయంగా విమర్శలు వచ్చాయి. చివరకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎన్ఓసీ రావటంతో అక్కడ చంద్రబాబు ఇంటి నిర్మాణ పనులు పార్టీ నేతలు ప్రారంభించారు.

ఇంటి నిర్మాణ పనులు ఆరంభం:శాంతిపురం మండలం శివపురం సమీపంలో కుప్పం పలమనేరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సుమారు 2 ఎకరాల స్థలాన్ని ఏడాది క్రితం చంద్రబాబు కొనుగోలు చేసారు. ఆ భూమిని కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత ఏడాది జూలై 22నే రిజిస్ట్రేషన్ చేయించారు. వ్యవసాయ భూమిగా ఉన్న ఆ స్థలంలో భవన నిర్మాణం కోసం ల్యాండ్ కన్వర్షన్ చేయాల్సి రావడంతో పలమనేరు- కుప్పం-మదనపల్లె (పీఎంకే) అర్బన్ డెవలప్మెంట్ అధారిటీకి ముందుగా అన్ని పత్రాలతో అనుమతి కోసం దరఖాస్తు చేశారు. ఎట్టకేలకు అనుమతులు లభించాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ ఏడాది ఆఖరు లోగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications