చంద్రబాబు కొత్త వ్యూహాలు - ఒకేసారి ముగ్గురు అభ్యర్ధుల ఖరారు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్ధుల ఖరారు పైన దృష్టి పెట్టారు. ఒకేసారి ముగ్గురు అభ్యర్ధులను ఖరారు చేసారు. పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఉన్న తగాదాల పరిష్కారం దిశగా పలు నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. నేతల మధ్య పోటీతో ఇన్‌చార్జి నిర్ణయం వాయిదాపడుతున్న నియోజకవర్గాలపై కూడా చంద్రబాబు దృష్టి సారించారు. వచ్చే నెల నుంచి తిరిగి జిల్లాల పర్యటనలకు చంద్రబాబు సిద్దం అవుతున్నారు.

కసరత్తు వేగవంతం: తెలుగుదేశం అధినే చంద్రబాబు ఎన్నికల కసరత్తు వేగవంతం చేసారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మూడు ఎస్సీ నియోజకవర్గాల్లో ఇన్‌చార్జుల ఎంపిక చాలాకాలంగా పెండింగ్‌లో ఉండగా ఒకేసారి ఇన్‌చార్జులను ఖరారు చేసి పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచారు. ఇందులో రెండు నియోజకవర్గాలకు వైద్యులను ఎంపిక చేశారు.

Chandra Babu

సత్యవేడుకు డాక్టర్‌ హెలెన్‌, గంగాధర నెల్లూరుకు డాక్టర్‌ థామ్‌సను నియమించారు. థామ్‌సను తొలుత చిత్తూరు లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా పెడదామనుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీ స్థానానికి మార్చారు. అలాగే పూతలపట్టు స్థానానికి తిరుపతిలో మురళీమోహన్‌ను ఎంపిక చేశారు. నియోజకవర్గ ఇంఛార్జ్ లతో రెండో విడత సమావేశాలు ప్రారంభించారు.

నేతల గొడవలపై ఫోకస్: నియోజకవర్గాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితి, ప్రత్యర్థి పార్టీలతో పోలిస్తే బలాబలాలు, ఇన్‌చార్జి పనితీరు, ప్రజాభిప్రాయం, ఇంకా అక్కడ దృష్టి సారించాల్సిన అంశాలపై వారితో విపులంగా చర్చిస్తున్నారు. లోపాలు సూచిస్తూ పరి చేసుకోవాలని నిర్దేశిస్తున్నారు. నియోజకవర్గాల్లో తగాదాల పరిష్కారంపైనా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. నేతల మధ్య పోటీతో ఇన్‌చార్జి నిర్ణయం వాయిదాపడుతున్న నియోజక వర్గాలపై కూడా చంద్రబాబు దృష్టి సారించారు.

గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దిపాటి వెంకటరాజు, పశ్చిమ గోదావరి జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజును పిలిపించి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును మార్చి వెంకటరాజును నియమించడంపై బాపిరాజు అసంతృప్తితో ఉన్నారు. ఆ నియోజకవర్గంలో సమస్యలను చక్కదిద్దే బాధ్యతను ఒకరిద్దరు సీనియర్‌ నేతలకు అప్పగించే అవకాశం ఉంది.

Chandra Babu

రాష్ట్ర వ్యాప్త పర్యటనల దిశగా: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు చేరికను నియోజకవర్గ ఇన్‌చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి మొదట వ్యతిరేకించారు. చంద్రబాబు పిలిపించి మాట్లాడాక అంగీకారం తెలిపారు. ఎస్‌సీవీ నాయుడు గురువారం ఇక్కడ అధికారికంగా టీడీపీలో చేరనున్నారు. విభేదాలున్న ఇంకో రెండు నియోజకవర్గాలపై త్వరలో సమావేశాలు జరుగనున్నాయి.

ఇప్పటి వరకు చంద్రబాబు రాష్ట్రంలోని 13 లోక్‌సభ స్థానాల్లో 29 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పర్యటించారు. తిరిగి వచ్చే నెల రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు చంద్రబాబు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. వచ్చే నెల నుంచి ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో దీనిపై కూడా క్షేత్ర స్థాయి నేతలను అప్రమత్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+