జూ ఎన్టీఆర్ ఫ్యాన్ శ్యామ్ కుటుంబానికి చంద్రబాబు ఫోన్ - కీలక నిర్ణయం..!!
జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మరణం కలకలం రేపింది. సినీ..రాజకీయ వర్గాల్లోనూ చర్చగా మారింది. తారక్ డై హార్ట్ ఫ్యాన్ శ్యామ్ ఆత్మహత్య చేసుకొని మరణించారు. ఒక సెల్ఫీ వీడియో కూడా వైరల్ అయింది. దీనికి సంబంధించి పలువురు అనుమానాలు వ్యక్తం చేసారు. ఇప్పటికే జూ ఎన్టీఆర్ తన ఫ్యాన్ మరణ పై ఒక లేఖ విడుదల చేసారు. ఇప్పుడు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా శ్యామ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ అనుమానాస్పద రీతిలో మరణించటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. శ్యామ్ ఆత్మహత్య చేసుకొని మరణంచారు. శ్యామ్ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆత్మహత్య చేసుకునే ముందు తీసుకున్న వీడియోలో అతను తన ఆత్మహత్యకు గల కారణాలని వెల్లడించాడు. అయితే ఈ ఆత్మహత్య పై టీడీపీ శ్రేణులు రాజకీయ కోణంలో సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఫ్యాన్స్ మాత్రం తమకు అనుమానాలు లేవని..విచారణ మాత్రం చేయాలని కోరుతున్నారు. దీని పైన స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ ఒక లేఖ విడుదల చేసారు.

శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన. శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలిచి వేస్తుంది. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు ఎన్టీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. దీని పైన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకొని మరణించినట్టుగా చెబుతున్నారు. ఇప్పుడు ఈ విషయం పైన టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఇప్పటికే ట్వీట్ చేసిన చంద్రబాబు తాజాగా శ్యామ్ కటుుంబ సభ్యులతో మాట్లాడారు.
శ్యామ్ కుటుంబ సభ్యులను తూర్పు గోదావరి టీడీపీ నేతలు కలిసారు. వారు చంద్రబాబుకు ఫోన్ చేసి శ్యామ్ తండ్రి శ్రీనివాసరావుతో మాట్లాడించారు. తన కుమరుడి మెడ పైన గాయాలు, బ్లేడుతో కోసిన గాట్లు ఉండటం..సెల్ఫీ వీడియోలో మరో వ్యక్తి మాటలు వినిపిస్తుండటం అనుమానానికి తావిస్తోందని శ్రీనివాసరావు చంద్రబాబుకు వివరించారు. అధైర్యపడొద్దని..అన్ని విధాలా సహకరించి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. శ్యామ్ కుటుంబానికి రూ 2 లక్షల ఆర్దిక సాయం ప్రకటించారు.












Click it and Unblock the Notifications