టికెట్ల ఖరారుపై చంద్రబాబు మార్క్ నిర్ణయం - సీనియర్లకు షాక్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఊపందుకుంది. వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పు పైన జగన్ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. పలువురు సిట్టింగ్ లను మార్పు చేస్తున్నారు. ఇటు టీడీపీ, జనసేనలో పొత్తులో భాగంగా సీట్ల ఖరారు పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీలో సీనియర్లు తమ వారుసులను ఈ ఎన్నికల్లో బరిలోకి దింపాలని భావిస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక కుటంబానికి ఒకే టికెట్ నిర్ణయం ఖరారు చేసారు.
చంద్రబాబు కసరత్తు: టీడీపీలో టికెట్ల ఖరారు విషయంలో చంద్రబాబు గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో గెలుపు ప్రతిష్ఠాత్మకం కావటంతో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. పార్టీలోని ప్రముఖ రాజకీయ కుటుంబాలకు ఈసారి ఎన్నికల్లో ఒకటే సీటు ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది.

గతంలో కొంత ఉదారంగా వ్యవహరించి రెండేసి సీట్లు ఇచ్చిన ఆ పార్టీ.. ఈసారి మాత్రం ముందగానే చంద్రబాబు తన విధానం ఏంటనేది స్పష్టత ఇస్తున్నారు. ఒక్క సీటే ఇస్తామంటూ.. తమ కుటుంబ సభ్యుల్లో ఎవరికి సీటు కావాలో వారే నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు. కర్నూలు జిల్లాలో కేఈ, కోట్ల కుటుంబాల విషయంలోనూ పార్టీ ఇదే వైఖరితో ముందుకు వెళ్తోంది.
సీనియర్లే తేల్చుకోవాలి: గత ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కర్నూలు ఎంపీగా పోటీ చేయగా.. ఆయన సతీమణి సుజా త ఆలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశా రు. ఇద్దరూ ఓడిపోయారు. ఇప్పుడు కూడా సుజాత అదే స్థానానికి ఇన్‌చార్జిగా ఉన్నారు. ఈసారీ రెండు సీట్లు కావాలని ఈ కుటుంబం కోరినా టీడీపీ అధినేత చంద్రబాబు సున్నితంగా తిరస్కరించారు.
వారిద్దరిలో ఎవరు ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయించుకుని చెప్పాలని సూచించారు. దీంతో, కోట్ల డోన్‌లో బరిలో దిగితే ఫలితం బాగుంటుందని కొందరు టీడీపీ నేతలు సూచిస్తున్నారు. డోన్‌కు ప్రస్తుతం వైసీపీ నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సీటును టీడీపీ నాయకత్వం ఈసారి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.
కుటుంబానికి ఒక్క సీటు: డోన్‌కు సుబ్బారెడ్డి ఇన్‌చార్జిగా ఉన్నారు. ఈ సమీకరణలపై అధినేతను కలిసి చర్చించాలని సూర్యప్రకాశ్‌రెడ్డి భావిస్తున్నారు. మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబం నుంచి ఆయన కుమారుడు శ్యాంబాబు పత్తికొండ అసెంబ్లీ స్థానానికి ఇన్‌ఛార్జిగా ఉన్నారు. అదే కుటుంబం నుంచి కేఈ తమ్ముడు, కేఈ ప్రభాకర్ కూడా సీటు కోరుతున్నారు.
అయితే ఒక్కటే ఇస్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు. కేఈ తన కుమారుడు శ్యాంకు అవకాశం కల్పించాలని కోరినట్లు చెబుతున్నారు. పరిటాల కుటుంబానికి ఒక సీటు మాత్రమేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సునీత, కుమారుడు శ్రీరామ్ లో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో నిర్ణయించుకో వాలని సూచించారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడుకు మాత్రం ఈ విధానం నుంచి మినహాయింపు ఇచ్చారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications