పొత్తు కోసం బీజేపీకి చంద్రబాబు భారీ ఆఫర్ - ఢిల్లీ స్పందన ఏంటి..!!

ఏపీలో జగన్ ను ఓడించేందుకు చంద్రబాబు తన బలగం సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే పవన్ తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు..తాజాగా బీజేపీతోనూ టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. బీజేపీకి తమ నుంచి చంద్రబాబు భారీ ఆఫర్ ఇచ్చారు. దీని పైన ఆలోచనలో పడ్డ బీజేపీ ఢిల్లీ నాయకత్వం ఇంకా పొత్తు పైన స్పష్టత ఇవ్వలేదు. అదే సమయంలో నో చెప్పలేదు. దీంతో..మధ్యవర్తిత్వం వహిస్తున్న నేతల నుంచి కీలక సమాచారం అందుతోంది.

కీలక పరిణామాలు : ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నామని తాజాగా పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. బీజేపీ నుంచి ఇప్పటి వరకు పొత్తుల పైన ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ సమయంలోనే చంద్రబాబు ఢిల్లీ మిత్రులు రంగంలోకి దిగారు. ఏపీలో టీడీపీతో తిరిగి బీజేపీ పొత్తు కొనసాగాలే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా చంద్రబాబు నుంచి బీజేపీకి తాజా ఆఫర్ పైన సమాచారం ఇచ్చారు. బీజేపీ ఏపీలో తమతో కలిసి వస్తే తాము ఎన్డీఏలో చేరేందుకు సిద్దమని ప్రతిపాదించినట్లు సమాచారం.

TDP Chief Chandra Babu latest proposal for BJP to join alliance for AP Elections

టీడీపీ ఆఫర్ : ఇదే సమయంలో బీజేపీకి ఏపీలో 5 లేదా 6 ఎంపీ సీట్లు ఇస్తామని చంద్రబాబు ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీని పైన స్పందించిన ఢిల్లీ నేతలు 8 నుంచి 10 సీట్లు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే, తుది నిర్ణయం ప్రధాని తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం ఇచ్చినట్లు సమాచారం. బీజేపీ తాజాగా మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత మరింత ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ సారి 400 లోక్ సభ సీట్లు గెలవాలని టాస్క్ గా నిర్ణయించుకుంది. దీంతో పాటుగా ఎన్డీఏలోకి కొత్త పార్టీలను చేర్చుకొనే ఆలోచన చేస్తోంది. దీంతో, జనసేన ఇప్పటికే చేరటంతో..టీడీపీ చేరిక పైన చర్చ మొదలైంది. ఏపీలో వైసీపీ ఎన్డీఏలోకి వచ్చే అవకాశం లేదు. వైసీపీ - బీజేపీ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోవటం సాధ్యం కాదు.

బీజేపీ నిర్ణయం ఏంటి : ఈ పరిస్థితుల్లో తిరిగి టీడీపీనీ ఎన్డీఏల చేర్చుకొని..పొత్తుతో ఏపీలో పోటీ చేసే అంశం పైన బీజేపీ త్వరలోనే తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. సంక్రాంతి సమయంలో ఈ పొత్తుకు సంబంధించి అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. బీజేపీ తో సంప్రదింపు కారణంగానే జనసేన, టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు పైన ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదని తెలుస్తోంది. దీంతో, బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిసి వస్తే 2014 తరహా పొత్తులు ఏపీలో తిరిగి కనిపించే అవకాశం ఉంది. మరి..బీజేపీ తుది నిర్ణయం ఎలా ఉంటుంది..మూడు పార్టీలు కలిస్తే ఏపీలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది ఇప్పుదు ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+