వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప‌వ‌న్‌కు చంద్ర‌బాబు స్నేహ హ‌స్తం: జ‌గ‌న్‌ను దెబ్బ తీయాలంటే త‌ప్ప‌దు: మారుతున్న స‌మీక‌ర‌ణాలు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

జనసేన తో పొత్తు ప్రతిపాదన దిశగా టీడీపీ అడుగులు || Chandra Babu Proposing Alliance With Janasena

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త స‌మీక‌ర‌ణాలు మొద‌ల‌వుతున్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో డీలా ప‌డిన టీడీపీ తిరిగి కొత్త ఎత్తుల కు సిద్దం అవుతోంది. పార్టీలో వ‌ల‌స‌లు.. డైల‌మాకు స‌మాధానంగా కొత్త జోష్ తేవాల‌ని టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త నిర్ణ‌యాల దిశ‌గా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా.. పార్టీలోని అత్యంత ముఖ్యుల‌తో చంద్ర‌బాబు కొత్త ప్ర‌తి పాద‌న చేసారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌గ‌న్ ను ఎదుర్కోవాలంటే తిరిగి జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుందామ‌ని ప్ర‌తిపాదన చేసారు. దీనిని పార్టీ సీనియ‌ర్లు సైతం మ‌ద్ద‌తు తెలిపారు. ఇప్ప‌టికే పార్టీలో కాపు నేత‌లు అసంతృప్తితో ఉన్నారు. వీరు పార్టీ వీడ‌కుండా ఈ పొత్తు ప్ర‌తిపాద‌న స‌రైంద‌నే అభిప్రాయానికి వ‌చ్చారు. అదే స‌మ‌యంలో జ‌న‌సేన‌లోనూ నైరాశ్యం క‌నిపిస్తోంది. దీంతో..మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌తోనే పొత్తు కుద‌ర్చుకోవాల‌ని..ఈ దిశ‌గా జ‌నసేన‌తో చ‌ర్చ‌లు చేయాల‌ని టీడీపీ ఒక నిర్ణ‌యానికి వ‌చ్చింది.

జనసేన దారెటు..? ప్రజా క్షేత్రమా.. సినిమా రంగమా..? గబ్బర్ సింగ్ గురి దేనిమీద...?జనసేన దారెటు..? ప్రజా క్షేత్రమా.. సినిమా రంగమా..? గబ్బర్ సింగ్ గురి దేనిమీద...?

ప‌వ‌న్‌తో పొత్తు పెట్టుకుందాం...

ప‌వ‌న్‌తో పొత్తు పెట్టుకుందాం...

ఏపీలో ఊహించ‌ని ఫలితాల‌తో డీలా ప‌డిన టీడీపీ లీడ‌ర్ల‌ను..కేడ‌ర్‌ను కాపాడుకోవాలంటే కొత్త నిర్ణ‌యాలు త‌ప్ప‌వ‌ని టీడీ పీ అధినేత చంద్ర‌బాబు నిర్ణ‌యానికి వ‌చ్చారు. దీనిలో భాగంగా..ప్ర‌స్తుతం బ‌లంగా క‌నిపిస్తున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ను ఎదుర్కోవాలంటే మ‌రో సారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మ‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు. తాజా ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌తో పొత్తు లేని కార‌ణంగా న‌ష్ట పోయామ‌ని ప‌లువురు నేత‌లు ఫ‌లితాల స‌మీక్ష‌లో చంద్ర‌బాబు వ‌ద్ద ప్ర‌స్తావించారు. ఇప్పుడు జ‌గ‌న్ కొత్త పధ‌కాల‌తో మ‌రింత‌గా ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ స‌మ‌యంలో ప‌వ‌న్‌తో పొత్తు పెట్టుకుంటే రాజ‌కీయంగా మేలు జ‌రుగుతుంద‌నే అభిప్రాయానికి వ‌చ్చారు. ఇందులో భాగంగా చంద్ర‌బాబు..ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రితో స‌న్నిహితంగా ఉండే ఒక ప్ర‌ముఖ వ్యాపార వేత్త ద్వారా రాయ‌బారం న‌డ‌పాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ప‌దేప‌దే చంద్ర‌బాబు - ప‌వ‌న్ ర‌హ‌స్య మిత్రులంటూ చేసిన ప్ర‌చారం మైత్రి మీద ప్ర‌భావం చూపింద‌ని..ఇప్పుడు నేరుగానే పొత్తు పెట్టుకొని ఏపీలో జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా బ‌ల‌ప‌డాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు. దీని కోసం త్వ‌ర‌లోనే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ వ‌ద్ద ప్ర‌తిపాద‌న తీసుకురానున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

జ‌గ‌న్‌..ఇద్ద‌రికీ ఉమ్మ‌డి శ‌త్రువు..

జ‌గ‌న్‌..ఇద్ద‌రికీ ఉమ్మ‌డి శ‌త్రువు..

ఏపీలో చంద్ర‌బాబు అదే విధంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఇప్పుడు జ‌గ‌న్ ఉమ్మ‌డిగా రాజ‌కీయ శ‌త్రువుగా మారారు. దీంతో.. ఇప్పుడు రాజ‌కీయంగా క‌లిసి పోరాటం చేయ‌క‌పోతే రెండు పార్టీల‌కు న‌ష్ట‌మ‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ఇదే స‌మ‌యంలో 2014 ఎన్నిక‌ల్లో క‌లిసి వ‌చ్చిన కాపు..బీసీ ఓటింగ్ తాజా ఎన్నిక‌ల్లో పూర్తిగా వైసీపీకి ఆ ఓటింగ్ ట‌ర్న్ అయింది. దీంతో..ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో టీడీపీ..జ‌న‌సేన అంచ‌నాలు త‌ల కిందుల‌య్యాయి. టీడీపీ మొత్తంగా 23 సీట్లు..జ‌న‌సేన కేవ‌లం ఒక్క సీటుకే ప‌రిమితం అయింది. అయితే, తాను ఓట‌మితో కుంగిపోన‌ని..పోరాటం కొన‌సాగిస్తాన ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేసారు. ఇప్ప‌టికే బీజేపీ నేత‌లు సైతం ప‌వ‌న్‌తో పొత్తుకోసం ప్ర‌య‌త్నాలు చేసినా..ప‌వ‌న్ క‌ళ్యాణ్ సానుకూలంగా స్పందించ‌లేదు. ఏపీలో నేత‌లు కొంద‌రు బీజేపీలోకి వెళ్లినా..ప్ర‌జ‌లు మాత్రం బీజేపీతో లేర‌నే విషయం అటు చంద్ర‌బాబు..ఇటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టంగా చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు బీజేపీ సంగ‌తి ఎలా ఉన్నా..టీడీపీ..జ‌న‌సేన పొత్తు అవ‌స‌ర‌మ‌నే అభిప్రాయం టీడీపీలోకే కాకుండా..అటు జ‌న‌సేన‌లోని కొంద‌రు టీడీపీ ముఖ్యుల‌తో ప్ర‌స్తావించిన‌ట్లు స‌మాచారం. అయితే, ప‌వన్ అభిప్రాయం ఏంట‌నేది ఇంకా స్ప‌ష్ట‌త లేదు.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నుండే...

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నుండే...

ఇప్పుడు టీడీపీలో మొద‌లైన ఈ పొత్తు ప్ర‌తిపాద‌నను ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌ద్ద‌కు తీసుకెళ్లి దీనిని ఆచ‌ర‌ణ‌లోకి తీసుకు వ‌చ్చే లా ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పైన వ్య‌తిరేకంగానే ఉన్నారు. తానా స‌భ ల్లో సైతం ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. జైలుకు వెళ్లి వ‌చ్చిన వారే ప‌ద‌వులు అనుభ‌వి స్తుంటే..తాను ఓడినంత మాత్రాన కుంగిపోవాలా అని ప్ర‌శ్నించారు. అయితే, రాజ‌కీయంగా ఇప్పుడు వ‌ప‌న్ సైతం ఒంట రి పోరాటం చేస్తే అది జ‌గ‌న్‌కే లాభిస్తుంద‌నే అంచనాలు మొద‌ల‌య్యాయి. దీంతో..రెండు పార్టీల మ‌ధ్య ప్ర‌తిపాద‌న స్థాయిలో ఉన్న పొత్తు వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తే రానున్న స్థానిక సంస్థ‌లు..మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనే క‌లిసి వెళ్లాల‌నేది తా జా నిర్ణ‌యం. దీని ద్వారా క్షేత్ర స్థాయిలో వైసీపీని దెబ్బ తీస్తే..రాజ‌కీయంగా జ‌గ‌న్‌ను ఎదుర్కోవ‌టం చాలా సులువుగా మారుతుంద‌నేది వీరి అభిప్రాయం. దీంతో..ఇప్పుడు చంద్ర‌బాబు అందిస్తున్న స్నేహ హ‌స్తాన్ని ప‌వ‌న్ అందుకుం టారా..లేదా అనేది ఆస‌క్తి క‌రంగా మారింది. పొత్తు కుదిరితే..ఏపీలో రాజ‌కీయం కొత్త ట‌ర్న్ తీసుకొనే అవ‌కాశం ఉంది.

English summary
TDP Chief Chandra Babu proposing alliance with Janasena to face Jagan in AP Politics. Babu initiating discussions with Janasena shortly. If Pawan agree with Babu..AP Politics may take new turn.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X