Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆనం, కోటంరెడ్డి సీట్ల ఖరారుపై చంద్రబాబు కీలక నిర్ణయం..!!

ఏపీలో ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు వెలువడుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల ఖరారు పైన ఒక నిర్ణయానికి వచ్చాయి. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్దుల ఖరారు కసరత్తు వేగవంతం చేసారు. ఈ నెల రెండో వారంలో అభ్యర్దులను ప్రకటించనున్నారు. పవన్ తో కలిసి ఉమ్మడి ప్రచారానికి సిద్దమవుతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు సీట్ల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

అభ్యర్దుల ఖరారు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ అభ్యర్దులను చంద్రబాబు ఖరారు చేసారు. నెల్లూరులో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లొ మరోసారి వైసీపీ తమ పట్టు నిరూపించుకొనే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ నుంచి దాదాపు అభ్యర్దులు ఖరారయ్యారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ ను నర్సరావుపేట ఎంపీగా ఖరారు చేయటంతో అక్కడ ఎండీ ఖలీల్ ను ప్రకటించారు.

TDP Chief ChandraBabu Almost finalised the contesting party candidates from Nellore District

నెల్లూరు రూరల్ నుంచి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గూడూరు నుంచి ఎమ్మెల్సీ నాగార్జున పేరు ఖరారు చేసారు. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. వెంకటగిరి నుంచి నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి పోటీ ఖాయమైంది. ఇదే సమయంలో టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా జిల్లాలో సీట్లను చంద్రబాబు ఖాయం చేసారు.

ఆత్మకూరులో ఆనం: నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలని జనసేన ఆశించింది. అయితే, ఈ సీటును మాజీ మంత్రి నారాయణకు కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తిరిగి నెల్లూరు రూరల్ స్థానాన్ని కేటాయించారు. వెంకటగిరి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి తిరిగి అదే స్థానం కావాలని చంద్రబాబును కోరారు.

కానీ, అక్కడ మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కు చంద్రబాబు సీటు కేటాయించారు. ఆనం రామనారాయణ రెడ్డి కి ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని సూచించారు. కాంగ్రెస్ లో గతంలో ఇదే సీటు నుంచి ఆనం గెలుపొందారు. వైసీపీకి ఈ నియోజకవర్గంలో వరుసగా గెలుస్తూ వస్తోంది. సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.

హోరా హోరీ పోరు: గూడూరు అభ్యర్దిగా పాశం సునీల్ కుమార్ పేరు ఖాయం చేసారు. కావలికి సంబంధించి కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. అక్కడ ఇంఛార్జిగా కావ్య కృష్ణారెడ్డిని నియమించారు. కావలి టౌన్ పార్టీ అధ్యక్షుడిగా గుత్తికొండ కిషోర్ బాబును ప్రకటించారు. నెల్లూరు ఎంపీ అభ్యర్ది విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీలో చేరితే నెల్లూరు ఎంపీగా ఆయన్ను పోటీ చేయించే అవకాశం ఉందని సమాచారం. అయితే, జిల్లాలో వైసీపీ అభ్యర్దుల తుది జాబితా వచ్చిన తరువాత ఎంపీ సీటు పైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక, ఈ జిల్లాలో ఎన్నికల్లో ఫలితాల పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన అభ్యర్దుల గెలుపు ఓటముల పైన ఆసక్తి కర చర్చ సాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+