చంద్రబాబు మీడియా గేమ్ - పాత మిత్రుడితో కొత్త సంబంధాలు - అల్టిమేట్ టార్గెట్ ఇదే..!!

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మొన్నటికి మొన్న ఒక వర్గానికి చెందిన రెండు మీడియా సంస్థలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేస్తోన్నాయంటూ మండిపడ్డారు. వాటిని ఎవరూ చూడొద్దంటూ పార్టీ నాయకులు, క్యాడర్‌కు సూచించారు. రాష్ట్రంలో అప్రజాస్వామ్యం, అరాచకం పెరిగిపోతోంటే అధికార పార్టీని కాదని ఆ రెండు ఛానళ్లు తమను విమర్శిస్తోన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీలి మీడియాగా..

నీలి మీడియాగా..

రెండు ప్రధాన న్యూస్ ఛానళ్లను నీలి మీడియాగా అభివర్ణించారు. వైఎస్ఆర్సీపీ అరాచకాలను ప్రాణాలొడ్డి అడ్డుకుంటోన్న తమను విమర్శిస్తోన్నాయని, వాటిని బాయ్‌కాట్ చేయాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోన్నాయని ధ్వజమెత్తారు. ఈ రెండు ఛానళ్లు ఉన్మాదులకు మద్దతు పలుకుతున్నాయని, వాటిని ఎవరూ చూడొద్దని చెప్పారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి.

మీడియాకు అనుకూలంగా..

సాధారణంగా మీడియాకు అనుకూలంగా ఉంటారనే ముద్ర చంద్రబాబుపై ఉంది. మెజారిటీ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు తెలుగుదేశానికి మద్దతు పలుకుతుంటాయనే అభిప్రాయాలు లేకపోలేదు. సాధారణ ప్రజల్లోనూ ఈ అభిప్రాయం బలంగా నాటుకు పోయింది. అలాంటి చంద్రబాబు ఉన్నట్టుండి రెండు ప్రధాన న్యూస్ ఛానళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం, వాటిని నీలి మీడియాగా అభివర్ణించడం హాట్ టాపిక్‌గా మారింది. అటు వైఎస్ఆర్సీపీ కూడా తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉండే వాటిపై ఎల్లో మీడియా ముద్ర వేసింది. వాటిని బాయ్‌కాట్ చేసింది.

రవి ప్రకాష్‌కు బర్త్‌డే విషెస్..

రవి ప్రకాష్‌కు బర్త్‌డే విషెస్..

ఈ పరిణామాల మధ్య చంద్రబాబు- సీనియర్ జర్నలిస్ట్‌‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌కు ఆయన బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. దీనికి రవి ప్రకాష్ ఫొటోను జత చేశారు. మీడియా రంగానికి టార్చ్ బేరర్‌గా రవి ప్రకాష్‌ను అభివర్ణించారు చంద్రబాబు. నిజాయితీతో, జర్నలిస్ట్ విలువలను అనుక్షణం కాపాడారని చెప్పుకొచ్చారు.

కొత్త చర్చ..

కొత్త చర్చ..

రవి ప్రకాష్‌కు చంద్రబాబు బర్త్‌డే విషెస్ చెప్పడం కొత్త చర్చకు తెర తీసింది. రవి ప్రకాష్ చేతుల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వార్తలను ప్రసారం చేసేదనే ముద్ర టీవీ9పై ఉండేదని, ఇప్పుడు యాజమాన్యం చేతులు మారిన తరువాత ఆ ప్రాధాన్యత తగ్గిందనే అంచనాలు ఉన్నాయి. చంద్రబాబు తాజాగా టీవీ9పై నీలి మీడియా అనే ముద్ర వేయడానికి, దాన్ని బాయ్‌కాట్ చేయాలని పిలుపునివ్వడానికీ అదే ప్రధాన కారణమని చెబుతున్నారు.

పాత మిత్రుడితో..

పాత మిత్రుడితో..

టీవీ9 నుంచి బయటికి వచ్చిన తరువాత రవి ప్రకాష్.. కొత్తగా మరో మీడియా హౌస్‌ను నెలకొల్పడానికి ప్రయత్నాలు సాగిస్తోన్నారు. దీనికి సంబంధించిన చర్చలు తుదిదశలో ఉన్నాయని సమాచారం. ఈ మీడియా హౌస్ కొత్తగా తెర మీదికి రాబోతోన్నందు వల్లే చంద్రబాబు.. రవి ప్రకాష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారనే వాదనలు వినిపిస్తోన్నాయి. తన పాత మీడియా మిత్రుడితో కొత్తగా సంబంధాలను పునరుద్ధరించుకోవడంలో భాగంగానే ఆయన విషెస్ చెప్పారనీ అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+