ఎన్‌డీయేలో తెలుగుదేశం పార్టీ చేరడంపై స్పందించిన చంద్రబాబు
వారం రోజులుగా జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీయేలో తెలుగుదేశం పార్టీ చేరబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై అటు బీజేపీకానీ, ఇటు టీడీపీకానీ స్పందించలేదు. తాజాగా మీడియాతో మాట్లాడిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్డీయేలో చేరతారన్న ప్రచారంపై స్పందించేందుకు నిరాకరించారు. అది ప్రచారం చేసేవారే దానికి జవాబు చెప్పాలన్నారు.
Recommended Video
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే గతంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని, కేంద్ర రాజకీయాలను తాము రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే కోణంలోనే చూస్తామని స్పష్టం చేశారు. పాలనపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పార్టీ రెండుసార్లు నష్టపోయిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి మంచిపేరు తేవాలనే తపనతో వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయామని, విభజన గాయాలు, ఆర్థికలోటులోనూ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు.

రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని, ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి వచ్చిందన్నారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ వల్లే ఏపీకి నష్టం ఎక్కువగా జరుగుతోందన్నారు. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందే తెలుగుదేశం పార్టీ అని, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత రెట్టింపు సంక్షేమాన్ని ప్రజలకు అందజేస్తామన్నారు. అవగాహన లేని వ్యక్తులే సంక్షేమం విషయం తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే నుంచి ఆర్‌జేడీ, శివసేన, అకాలీదళ్ లాంటి ముఖ్యమైన పార్టీలన్నీ కూటమిని వీడాయి. చెప్పుకోదగ్గ మిత్రపక్షం లేకపోవడంతో తెలుగుదేశం పార్టీకి బీజేపీ స్నేహహస్తాన్ని అందిస్తోందంటూ జాతీయస్థాయిలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఇరుపార్టీల నేతలు ఖండిస్తూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications