వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామ్‌ వ్యాఖ్యల వివాదంలో మరో ట్విస్ట్‌- విజయవాడ ఏసీపీ హెచ్చరికలు తప్పుబట్టిన చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

విజయవాడ స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనలో రమేష్ ఆస్పత్రిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై టాలీవుడ్ హీరో, రమేష్ ఆస్పత్రి యజమాని రమేష్‌ బాబు బంధువు రామ్‌ పోతినేని చేసిన వ్యాఖ్యలపై పోలీసులు సీరియస్‌ అయ్యారు. ఈ వ్యవహారంలో తలదూర్చాలని చూస్తే నోటీసులు తప్పవని రామ్‌ను హెచ్చరించారు. దీంతో ఆయన కూడా స్వర్ణప్యాలెస్‌ ఘటనపై ఇక ట్వీట్లు పెట్టబోనని క్లారిటీ ఇచ్చారు. కానీ విజయవాడ పోలీసుల తీరుపై విపక్ష టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.

రామ్‌కు నోటీసులు ఇస్తామని విజయవాడ ఏసీపీ బెదిరించడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాయడం, ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ట్వీట్ పెట్టడమే విచారణకు అడ్డుపడటంగా నోటీసులు ఇవ్వాలనుకోవడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. '' రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఏవిధంగా కాలరాస్తున్నారో అనడానికి ఇది మరో రుజువు. రాష్ట్రంలో ప్రాధమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారు.
మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. ప్రశ్నించే గొంతును అణిచేయాలని చూడటం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా'' చంద్రబాబు పేర్కొన్నారు.

tdp chief chandrababu condemns vijayawa police warnings to hero ram potineni

రమేష్ ఆస్పత్రి యజమానితో ఉన్న సంబంధాల నేపథ్యంలో టీడీపీ ఈ అగ్నిప్రమాద ఘటనపై నోరు మెదపడం లేదని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు డాక్టర్ రమేష్‌ బాబు బంధువు అయిన రామ్‌ను వెనకేసుకొస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇందులో మరో ట్విస్ట్‌గా మారాయి. ఈ వ్యవహారానికి తాను దూరంగా ఉంటూ పార్టీ నేతలతో విమర్శలు చేయిస్తున్న చంద్రబాబు ఇవాళ రామ్‌కు మద్దతుగా పోలీసుల తీరుకు వ్యతిరేకంగా స్పందించడం చర్చనీయాంశమవుతోంది.

English summary
telugu desam party chief chandrababu naidu on monday condemns vijayawad police acp surya chandra rao's warning to tollywood hero ram pothineni over his comments on ramesh hospital fire accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X