సోనూసూద్‌కు మరోసారి గ్రీటింగ్ తెలిపిన చంద్రబాబు: ఎందుకంటే?: గొప్ప మానవతావాదిగా

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కు మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఓ రైతుకు ట్రాక్టర్‌ను విరాళంగా ఇచ్చిన సమయంలో చంద్రబాబు.. నేరుగా ఆయనతో ఫోనులో మాట్లాడారు. తాజాగా మరోసారి సోనూకు గ్రీటింగ్ తెలిపారు. సోనూసూద్‌ వంటి వ్యక్తులు ఈ భూప్రపంచాన్ని మంచితనంతో నింపేస్తున్నారని చెప్పారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

సోనూసూద్‌కు చంద్రబాబు తాజాగా గ్రీటింగ్స్ చెప్పడానికి కారణం ఉంది. ఐక్యరాజ్యసమితి ఆయనకు అవార్డును ప్రకటించింది. ప్రత్యేక మానవతా పురస్కారాన్ని సోనూసూద్‌కు ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమాల (యూఎన్‌డీపీ)కి చెందిన ప్రతిష్ఠాత్మక ఎస్డీజీ స్పెషల్ హ్యూమనైటేరియన్ అవార్డుకు సోనూ ఎంపిక అయ్యారు. లాక్‌డౌన్ సమయంలో ఉపాధిని కోల్పోయి.. స్వగ్రామానికి తిరుగు ప్రయాణం కట్టిన వేలాదిమంది దినసరి వేతన కార్మికులకు సోనూసూద్ రవాణా వసతిని కల్పించిన విషయం తెలిసిందే.

TDP Chief Chandrababu congratulate to actor Sonu Sood for being honoured with UNDP award

వందలాది కిలోమీటర్ల దూరాన్ని కాలి నడకన అధిగమిస్తోన్న వారి వెతలను చూసిన సోనూ సూద్ మానవతా దృక్పథంతో వ్యవహరించారు. వారి కోసం వందలాది ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేశారు. పలువురిని విమానాల ద్వారా స్వరాష్ట్రాలకు చేర్చారు. దీనికోసం అయ్యే ఖర్చును ఆయన సొంతంగా భరించారు. ఆ తరువాత కూడా ఆయన పలువురికి తనవంతు సహాయ, సహకారాలను అందించారు. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన రైతు తన ఇద్దరు కుమార్తెలను కాడెద్దులుగా మార్చి పొలం దున్నడాన్ని చూసిన ఆయన ట్రాక్టర్‌ను కొనిచ్చారు.

Recommended Video

    Telangana Telugu Desam Cadre With L. Ramana | నాయకత్వం లో మార్పు ఉండదు .

    అలాగే- లాక్‌డౌన్ వల్ల పాఠశాలలు, విద్యాసంస్థలకు దూరమైన పేద విద్యార్థులకు ఆన్‌లైన్ సౌకర్యాన్ని కల్పించడానికి స్మార్ట్‌ఫోన్లను కొనిచ్చారు. సోనూసూద్ మానవతా దృక్పథం కింద చేపట్టిన ఈ సహాయ కార్యక్రమాలు ఐక్యరాజ్యసమితి దృష్టికి చేరాయి. దీనితో ఆయనకు హ్యూమనైటేరియన్ అవార్డును ప్రకటించింది ఐరాస. ప్రతిష్ఠాత్మక అవార్డును సోనూకు దక్కడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+