ఎంపీ అభ్యర్థుల్లో చంద్రబాబు సంచలన నిర్ణయం

సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. దేశవ్యాప్తంగా ఏడు విడతలుగా లోక్ సభ ఎన్నికలు జరుగుతుండగా ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు నాలుగో విడత జరగనున్నాయి. మే13వ తేదీన ఒకే దశలో ఎన్నికలు జరిగి జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. అన్ని లోక్ సభ స్థానాలకు, అసెంబ్లీ నియోజకవర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించేంది. తెలుగుదేశం పార్టీ మాత్రం విడతలవారీగా ప్రకటించుకుంటూ వస్తోంది. రేపో, ఎల్లుండో ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. ఒకటి, రెండు నియోజకవర్గాలు మినహా అన్నిస్థానాల్లో ఎంపీ అభ్యర్థులు ఖరారైనప్పటికీ సామాజిక సమీకరణాలు, ఆర్థిక బలాలను అంచనా వేసుకుంటుండటంతో జాబితా విడుదల చేయడానికి ఆలస్యమవుతోంది.

పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం తొమ్మిది నియోజకవర్గాలకు మాత్రం ఎంపీ అభ్యర్థులు ఖరారయ్యారు. వారిలో విజయవాడ నుంచి కేశినేని చిన్ని, శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయులు, ఒంగోలు నుంచి మాగుంట రాఘవరెడ్డి, నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అనంతపురం నుంచి జేసీ పవన్ రెడ్డి, హిందూపురం నుంచి బీకే పార్థసారధి, నంద్యాల నుంచి బైరెడ్డి శబరి ఖరారైనట్లు తెలుస్తోంది.

tdp chief chandrababu finalized 9 lok sabha candidates

మిగతా నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటిస్తారా? లేదంటే ఖరారైనంతవరకు ప్రకటన చేస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం 25 లోక్ సభ నియోజకవర్గాలకు గాను 17 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీకి సిద్ధమవుతోంది. రెండు స్థానాల్లో జనసేన, ఆరు స్థానాల్లో బీజేపీ సిద్ధమవుతున్నాయి. కాకినాడ, మచిలీపట్నం నుంచి జనసేన తరఫున తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, వల్లభనేని బాలశౌరి పోటీపడుతున్నారు. బీజేపీ తన స్థానాల్లో పోటీపడే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+