మీ కంపెనీ మీ ఇష్టమన్న MP కేశినేనిపై మండిపడ్డ చంద్రబాబు?

తెలుగుదేశం పార్టీ తరఫున విజయవాడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తోన్న కేశినేని నాని పార్టీ అధినేతపై మరోసారి దురుసుగా మాట్లాడారు. గతంలో రెండు సందర్భాల్లో ఇలాగే వ్యవహరించిన నాని తాజాగా ఎన్టీఆర్ జిల్లా సమీక్షా సమావేశానికి హాజరై చంద్రబాబు ఎదుటే దురుసుగా ప్రవర్తించారు. దీనిపై అధినేత నొచ్చుకున్నట్లు తెలుస్తోంది.

టీడీపీని కంపెనీతో పోల్చిన కేశినేని

టీడీపీని కంపెనీతో పోల్చిన కేశినేని

సమీక్షకు హాజరైన కేశినేని పార్టీని ఒక కంపెనీగా పేర్కొంటూ వ్యాఖ్యానించారు. ''మీ కంపెనీ.. మీ ఇష్టం.. మీ వారసుడి ఇష్టం'' అన్నట్లుగా మాట్లాడారని తెలుస్తోంది. ''నేను నా కంపెనీని నా ఇష్టం వచ్చినట్లుగా నడుపుకుంటాను.. అలాగే మీరు కూడా తెలుగుదేశం పార్టీని నడుపుకోండి'' అని విమర్శించారు. దీంతో చంద్రబాబు ముందు షాక్ తిన్నా తర్వాత కేశినేనిపై మండిపడ్డారు. ఇది కంపెనీ కాదని, ప్రజలందరి పార్టీ అని, తాను లక్ష్మీపార్వతి, హరికృష్ణల నుంచి పోరాడి తన నాయకత్వం కిందకు తెచ్చుకున్నానని, అలా చేసినందుకు పార్టీలో అందరి సమ్మతి ఉందని, పార్టీని కాపాడటానికే తాను అలా చేశానని చెప్పారు. పార్టీకి తాను విధేయుడిగానే ఉంటున్నానని, పార్టీని ఎక్కడా ఇబ్బంది పెట్టలేదని నాని అన్నారు.

 బొకే ఇవ్వమంటే నానా హంగామా

బొకే ఇవ్వమంటే నానా హంగామా


వాస్తవానికి కేశినేని నాని పార్టీకి విధేయత కలిగిన నాయకుడే. కానీ ఇటీవలి కాలం నుంచి పార్టీ తనను దూరం పెడుతోందని, తనకు వ్యతిరేకులుగా ఉన్నవారిని చేరదీస్తోందని అనుమానిస్తున్నారు. ఆ అనుమానంతోనే పార్టీకి, తనకు దూరం పెరిగేలా చేసుకుంటున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో బాబుకు బొకే ఇవ్వమని మరో ఎంపీ గల్లా జయదేవ్ అందివ్వగా ఇవ్వకుండా చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

 తనకు బదులుగా వేరేవారిని ప్రోత్సహిస్తున్నారు

తనకు బదులుగా వేరేవారిని ప్రోత్సహిస్తున్నారు


తాను ఎంపీగా ఉన్నప్పటికీ తన స్థానంలో వేరేవారిని ప్రోత్సహిస్తున్నారని, పదే పదే తన విధేయతను చూపించుకోవాలనడం భావ్యం కాదని బాబుతో వ్యాఖ్యానించారు. తనకు ఎన్నో ఆఫర్లు ఉన్నప్పటికీ పార్టీ కోసం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. బీజేపీ పెద్దల నుంచి ఆఫర్ వచ్చినా తాను పార్టీ మారలేదని, సుజనా చౌదరి, సీఎం రమేష్ చేసినట్లుగా తాను పార్టీకి ద్రోహం చేయనన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయదలుచుకోవడంలేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి దాదాపుగా తాను గుడ్ బై చెబుతున్నట్లుగా అధినేత ముఖంమీదే చెప్పేయడంతో రాజకీయాల్లో కొనసాగుతారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+