Chandrababu-Rajinikanth : రజనీకాంత్ కు చంద్రబాబు ఫోన్ - వైసీపీ రచ్చపై ఏం మాట్లాడుకున్నారంటే ?

ఏపీలో తాజాగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహితంగా గడిపారు. ఆయన ఇంటికెళ్లి ఆతిధ్యం స్వీకరించడమే కాకుండా.. ఆ తర్వాత ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల వేదికపైనా చంద్రబాబుపై పొగడ్తల జల్లు కురిపించారు. అనంతరం దీనిపై అధికార వైసీపీ నేతలు విమర్శల దాడి మొదలపెట్టారు. అది ఇప్పటివరకూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయనకు కాల్ చేసారు.

చంద్రబాబుపై రజనీకాంత్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి. వీటిపై మండిపడుతున్న రజనీకాంత్ అభిమానులు.. సోషల్ మీడియాలో గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. అలాగే రజనీకాంత్ కు క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కూడా రజనీకాంత్ కు ఫోన్ చేసి తాజా పరిస్ధితులపై మాట్లాడినట్లు తెలుస్తోంది.

tdp chief chandrababu phone call to rajinikanth amid ysrcp attack-here are details

చంద్రబాబు, రజనీకాంత్ మధ్య ఫోన్ సంభాషణలో వైసీపీ నేతల విమర్శలే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. రజనీకాంత్‍పై వైసీపీ నేతల తీవ్ర విమర్శల పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. చంద్రబాబు విజనరీ అంటూ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను జీర్ణించుకోలేని వైసీపీ నేతలు విమర్శలకు దిగడంపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

అలాగే వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోవద్దని రజనీకాంత్‍ను చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. ఎవరెన్ని విమర్శలు చేసినా స్పందించబోనని, ఉన్న విషయాలే చెప్పానని రజనీకాంత్ ఇందుకు బదులిచ్చినట్లు సమాచారం. నా అభిప్రాయం మారదు, సంయమనం పాటించాలని అభిమాన సంఘాలకు చెప్పానని రజనీకాంత్ చంద్రబాబుకు వివరించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఇరువురి నుంచి ప్రకటేనేదీ రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+