టీడీపీకి ఆ నియోజకవర్గంలో అభ్యర్థి లేరా.?

ఏపీలో ఎన్నికల సందడి కనిపిస్తుంది. మరో ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో.. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాబోవు ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కూడా ఈసారి తమ సత్తా చాటాలని భావిస్తుంది. ఇలా అన్ని రాజకీయ పార్టీలు కూడా 2024 ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి.

ఈక్రమంలోనే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని పార్టీల అధినేతలు భావిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో అధికార వైసీపీ అందరి కంటే ఓ అడుగు ముందుందని చెప్పాలి. ఆ పార్టీ నుంచి ఒకరికి ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. దీనికి పూర్తి విరుద్దంగా ప్రతిపక్షాల పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకని పరిస్థితి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల లేమితో బాధపడుతుంది.

Tdp

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో టీడీపీకి సరైన అభ్యర్థి కనిపించడం లేదు. అక్కడ క్యాడర్ ఉన్న లీడర్ లేని పరిస్థితి నెలకొంది. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ తిరువూరు నియోజకవర్గంలో పాగా వేశాయి. 2014లో చంద్రబాబు సీఎం అయినప్పుడు కూడా ..ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ అభ్యర్థిని మార్చినప్పటికీ ..ఫలితం మాత్రం మారలేదు. అప్పటి మంత్రి జవహర్‌ను తిరువూరు నియోజకవర్గం బరిలోకి దింపిన లాభం లేకుండా పోయింది.

Tdp

తిరువూరు నుంచి వైసీపీ తరుఫున వరుసగా రెండుసార్లు రక్షణ నిధి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇక్కడ నుంచి టీడీపీ తరుఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. మరోసారి తిరువూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి మాజీ మంత్రి జవహర్ సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఆయన తాను గతంలో పోటీ చేసి విజయం సాధించిన కొవ్వూరు నుంచే పోటీ చేయడానికి సిద్దం అవుతున్నారు. ఈక్రమంలో తిరువూరు నుంచి టీడీపీ తరుఫున పోటీ చేయడానికి సరైన అభ్యర్థి ఎవరూ కనపించడం లేదు.

Tdp

ఎన్నికల సమయానికి ఎవరో ఒకరిని ప్రకటించి హడావిడి చేయడం తప్పితే..తిరువూరులో వైసీపీకి చెక్ పెట్టే అభ్యర్థి నిలబెట్టడంలో పార్టీ అధినేత ఫెయిల్ అవుతునే ఉన్నారనే కామెంట్స్ కార్యకర్తల నుంచి వినిపిస్తుంది. ఇప్పటికైన తిరువూరులో బలమైన అభ్యర్థిని ముందుగానే ప్రకటించాలని నియోజకవర్గ టీడీపీ క్యాడర్ పార్టీ అధిష్టానాన్ని కోరుతుంది. మరి ఈ సమస్యకు పార్టీ అధినేత చంద్రబాబు ఎలాంటి పరిష్కరం చూపుతారో చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+