గుంటూరు జిల్లాను టార్గెట్ గా పెట్టుకున్న చంద్రబాబు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఎన్ని సీట్లు గెలవాలో.. లక్ష్యాన్ని నిర్ధేశించిన టీడీపీ అధినేత చంద్రబాబు.

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్నిఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అందుకు తగ్గట్లుగా తన ప్రణాళికను అమలు చేసుకుంటూ వెళుతున్నారు. గతానికి భిన్నంగా, తన సహజశైలికి విరుద్ధంగా కొన్ని నియోజకవర్గాల్లో ముందుగానే అభ్యర్థులను స్వయంగా ప్రకటించారు. అధికారంలో ఉన్న వైసీపీ రచించే వ్యూహానికి ప్రతి వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.

వైసీపీ, టీడీపీ.. హోరాహోరీగా..

వైసీపీ, టీడీపీ.. హోరాహోరీగా..

కుప్పంలో చంద్రబాబును ఓడించి మానసికంగా టీడీపీని దెబ్బతీయగలిగితే రాష్ట్రవ్యాప్తంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా వైసీపీ జెండాను రెపరెపలాడించాలని ఆ పార్టీ భావిస్తోంది. దీనికి విరుగుడుగా చంద్రబాబు రాయలసీమ మొత్తం వైసీపీని దెబ్బ కొడతానంటూ ప్రచారం చేస్తున్నారు. ఇరు పార్టీలు ఒకరిపై మరొకరు వ్యూహ ప్రతివ్యూహాలు రచించుకుంటున్నాయి. జిల్లాలవారీగా, నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహించుకుంటూ వస్తోన్న బాబు గుంటూరు జిల్లాపై సమీక్షను పూర్తిచేశారు.

కచ్చితంగా 15 గెలిచి తీరాలి

కచ్చితంగా 15 గెలిచి తీరాలి

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలున్నాయి. రానున్న ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి 15 నియోజకవర్గాలు గెలిచి తీరాలంటూ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఇటీవల ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో వచ్చే ఎన్నికలకు సంబంధించి గుంటూరు జిల్లాలో 8 స్థానాలు దక్కించుకుంటుందని తేలింది. సమావేశంలో ఇది ప్రస్తావనకు వచ్చింది. 17 స్థానాలు గెలుపొందాలనే లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేయాలని, కచ్చితంగా మాత్రం 15 నియోజకవర్గాలు దక్కించుకోవాలని, అందుకు తగ్గ వ్యూహరచన చేస్తే మూడురోజులు జిల్లావ్యాప్తంగా రోడ్ షో నిర్వహిస్తానని అధినేత చెప్పారు.

వైసీపీకి అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మద్దాలి గిరి

వైసీపీకి అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మద్దాలి గిరి


గత ఎన్నికల్లో టీడీపీ గుంటూరు పశ్చిమ, రేపల్లె నియోజకవర్గాల్లో మాత్రమే గెలుపొందగలిగింది. గుంటూరు పశ్చిమ నుంచి విజయం సాధించిన మద్దాలి గిరి వైసీపీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేరికవల్ల గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పార్టీ బలం పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమైంది. మరొక కీలకమైన నేత ఒకరు త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి వస్తారని జిల్లా నేతలకు చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+