'ఆ ఇద్దరి'పై ఆధారపడిన చంద్రబాబు కేసు... మంగళవారం ఫైనలా?

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ అక్టోబరు 3వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ ఎదుట ఇది విచారణకు రానుంది. ఈ కేసుపై బుధవారమే జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్ ల ధర్మాసనం ముందు విచారణ జరగాల్సి ఉండగా జస్టిస్ భట్ తప్పుకోవడంతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

భట్ సభ్యుడిగా లేని బెంచ్ ఎదుట విచారణ చేపట్టాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా పిటిషన్ ను వచ్చే వారానికి వాయిదా వేయబోయారు. అయితే ఈ కేసులో ఉన్న అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని త్వరగా విచారణ చేపట్టాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. అత్యవసరమని, వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులివ్వొద్దని కోరారు. అందుకు జస్టిస్ ఖన్నా అంగీకరించారు. దీంతో న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వెంటనే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి వెళ్లి ఈ కేసును మెన్షన్ చేసి వివరాలన్నీ తెలిపారు. అలాగే ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్ కుమార్ కూడా తన వాదనలను బెంచ్ దృష్టికి తెచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కేసును అక్టోబరు 3కు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.

tdp chief chandrababu skill development case latest update

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. నాలుగోతేదీ ఉదయం పదిగంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని 41ఏ కింద నోటీసు జారీచేశారు. ప్రస్తుతం లోకేశ్ ఢిల్లీ అశోకారోడ్ లోని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో ఉన్నారు. ఎంపీ కార్యాలయానికి వెళ్లి లోకేశ్ కు నోటీసులు అందజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+