ఇన్నేళ్లుగా ఎదురు చూసింది దేనికోసమో తెలుసా?

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. దీంతో వైసీపీకి కౌంట్ డైన్ ప్రారంభమైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒకరకంగా ఏపీ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్లుగా ఉందని, మే 13వ తేదీ అనేది అందరికీ చారిత్రకమైన రోజన్నారు. ఎవరికీ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఓటేయడానికి అందరూ స్వేచ్ఛగా రావాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో జగన్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని, పోలింగే మిగిలిందని ట్వీట్ చేశారు. ఒక్క ఛాన్స్ ను నో ఛాన్స్ అంటున్నారని, నిర్భయంగా ప్రజాగళం వినిపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నవశకంవైపు తొలి అడుగుకు స్వాగతమని, రాష్ట్రానికి అన్నీ మంచిరోజులే అన్నారు. బయటకు వస్తే పింఛన్లు కట్ చేస్తారని, కేసులు పెడతారనే భయాన్ని వదిలిపెట్టాలన్నారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలనేది టీడీపీ నినాదమన్నారు.

tdp chief chandrababu tweet on election commission schedule

తెలుగుదేశం లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో న్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, న్యాయపరమైన అంశాలపై చంద్రబాబునాయుడు కమిటీతో చర్చించారు. ఎన్టీయే కూటమి అధికారంలోకి రాబోతోందని, కూటమికి 400 సీట్లు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఏపీలో కూడా ఎన్డీయే కూటమి కనీ వినీ ఎరగని రీతిలో సీట్లు దక్కించుకోబోతున్నట్లు తెలిపారు. ఏపీని ఉన్మాది పాలన నుంచి విముక్తి చేసేందుకు అందరూ పోరాడాలన్నారు.

సాంకేతికపరమైన అంశాలతో చివరి నిముషంలో నామినేషన్లకు సంబంధించి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తోందని, తనపై ఎన్ని కేసులున్నాయో చెప్పడమని డీజీపీని కోరానని, దొంగ కేసులు పెట్టి నామినేషన్లు చెల్లుబాటు కాకుండా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, బీజేపీ, జనసే అభ్యర్థులు పోటీచేస్తున్న స్థానాల్లోని అభ్యర్థులపై దొంగ కేసులు బనాయించనున్నారని, దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+