సీఎం జగన్ పై చంద్రబాబు కొత్త స్ట్రాటజీ - కీలకం నిర్ణయం, పవన్ తో కలిసి..!!
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సమర శంఖం పూరించేందుకు సిద్దమయ్యారు. పొత్తుతో పాటుగా మేనిఫెస్టో ప్రకటనకు రంగం సిద్దమైంది. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా కౌంటర్ స్ట్రాటజీ సిద్దం చేస్తున్నారు. పార్టీ మహానాడు ఇందుకు వేదిక కానుంది. ఎన్నికల ముందు జరుగుతున్న రాజమండ్రిలో నిర్వహిస్తున్న మహానాడు ద్వారా చంద్రబాబు కీలక ప్రకటనలు చేయనున్నారు. ఇక పవన్ తో కలిసి కామన్ అజెండా ప్రకటనకు ముహూర్తం సిద్దం చేసారు. ఎన్నికల దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.
గతం కంటే భిన్నంగా : చంద్రబాబు గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోతో పాటుగా పార్టీ అభ్యర్ధుల పై ముందుగానే ప్రకటనకు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో జరిగే మహానాడు వేదిక కానుంది. కనివినీ ఎరగని రీతిలో రాజమండ్రిలో మహానాడు నిర్వహిస్తున్నట్లు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.

వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన అంశాలను మహా నాడు వేదికగా చంద్రబాబు ప్రకటించనున్నారు. 26న మహానాడు కోసం రాజమండ్రికి చంద్రబాబు చేరుకోనున్నారు. అదే రోజు సాయంత్రం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేసారు. మహానాడులో ప్రవేశ పెట్టే 15 తీర్మానాలను పోలిట్ బ్యూరో సమావేశంలో ఆమోదించనున్నారు.
చంద్రబాబు కీలక ప్రకటనకు సిద్దం : మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటనకు సిద్దం అవుతున్నారు. ఈ సారి మహానాడులో రాజకీయ తీర్మానం కీలకం కానుంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనీయకుండా అన్ని పార్టీలు కలవాలనే పవన్ ప్రతిపాద నకు మద్దతు ప్రకటిస్తూ మహానాడులో తీర్మానం చేస్తారని విశ్వసనీయ సమాచారం. దీని ద్వారా పొత్తుల పైన మహానాడు వేదికగా క్లారిటీ ఇచ్చేందుకు అంతా సిద్దం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ సంక్షేమం తో పాటుగా సామాజిక న్యాయం గురించి పదే పదే ప్రస్తావిస్తున్న సమయంలో చంద్రబాబు దీనిని కౌంటర్ చేస్తూ తాము అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమంతో పాటుగా సామాజిక వర్గాల వారీగా అందిచే మేలు గురించి ప్రధాన అంశాలను వెల్లడించనున్నారు. మహానాడు వేదికగా గతంలో పార్టీ వీడి ఇతర పార్టీల్లో చేరిన ముఖ్య నేతలు..అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు అధికారికంగా టీడీపీ కండువా కప్పుకుంటారని పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. పొత్తులు..కార్యాచరణ పైన ప్రకటన చేయనున్నారు.

పవన్ తో కలిసి మేనిఫెస్టో : మహానాడు వేదికగా మేనిఫెస్టోలే ప్రధాన అంశాలను చంద్రబాబు వెల్లడించినా..పూర్తి మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. కలిసి వస్తే బీజేపీ తో సహా పవన్ కల్యాణ్ తో కలిసి రానున్న విజయ దశమి నాడు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాలని చంద్రబాబు ముహూర్తంగా నిర్ణయించారు. బీజేపీ కలిసి వస్తే మూడు పార్టీల నేతల సమక్షంలో మేనిఫెస్టో ప్రకటించనున్నారు.
లేకుంటే చంద్రబాబు - పవన్ ఉమ్మడి అజెండా లో భాగంగా మేనిఫెస్టోలో అంశాల పైన దసరా నాడు ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పొత్తు పైన బీజేపీ నిర్ణయం వచ్చే వరకూ వేచి చూడాలని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. దీంతో బీజీపీ, జనసేతో మైత్రి దిశగా మహానాడు వేదికగా ప్రకటనలు ఉండే ఛాన్స్ ఉంది. దీంతో..మహానాడు వేదికగా చంద్రబాబు ప్రసంగం పైన ఆసక్తి పెరుగుతోంది.
-
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications