కొడాలి నానిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతలు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, వర్ల రామయ్య, బుద్ధా వెంకన్న తదితరులు ఫిర్యాదు చేసినవారిలో ఉన్నారు.
కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే తాట తీస్తామని హెచ్చరించారు. మంత్రి పదవి పోయినా సిగ్గు రాలేదని, గూగుల్‌లో 420 అని సెర్చ్ చేస్తే ముఖ్యమంత్రి పేరే వస్తోందంటూ ధ్వజమెత్తారు. తమ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయకపోతే ప్రయివేటు కేసు వేస్తామని స్పష్టం చేశారు. గుడివాడ నుంచి కొడాలి నానిని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలపై చంద్రబాబు మండిపడిన సంగతి తెలిసిందే. విజయవాడ నగరంలో మాజీ కార్పొరేటర్, పార్టీ నాయకుడైన చెన్నుపాటి గాంధీపై వైసీపీ నాయకులు దాడిచేసిన విషయానికి సంబంధించి బాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మినీ మహానాడును నిర్వహించడానికే అందరూ కలిసి సమన్వయం చేసుకోలేకపోతున్నారని, ఐకమత్యం లేదని, పనితీరు బాగోలేదని, ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ వ్యవహారాలు తానే చూస్తానన్నారు. బాబు హెచ్చరించిన మూడురోజులకు వీరిలో స్పందన వచ్చింది. నేతలంతా కలిసికట్టుగా తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చి మాజీ మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications