షాక్: నేతల తీరుపై బాబు రహస్య సర్వే, నామినేటేడ్ పదవుల కోసమేనా?

గుంటూరు: ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో గుంటూరు జిల్లాలో నేతల పనితీరుపై టిడిపి నాయకత్వం రహస్యంగా సర్వే నిర్వహిస్తోంది., నామినేటేడ్ పోస్టులను భర్తీ చేసే విషయమై ఈ సర్వేను ప్రాతిపదికగా తీసుకొనే అవకాశాలు ఉన్నాయని పార్టీలో ప్రచారం సాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అప్పుడే కన్పిస్తోంది. ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుండే కసరత్తును ప్రారంభిస్తున్నాయి. అయితే నామినేటేడ్ పదవులు పొందిన నేతలు ఏ మేరకు పార్టీ కోసం పనిచేస్తున్నారు.

. పార్టీ కోసం పనిచేస్తూ పదవులు పొందనివారి పరిస్థితి ఎలా ఉంది, ఏ ప్రాంతంలో ఏ నాయకుడి పనితీరు ఎలా ఉందనే విషయాలపై చంద్రబాబునాయుడు నియమించిన టీమ్ సర్వే నిర్వహిస్తోంది.ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఈ టీమ్ తన సర్వేను కొనసాగిస్తోంది.

పార్టీ నేతల తీరుపై రహస్య సర్వే

పార్టీ నేతల తీరుపై రహస్య సర్వే

2014 ఎన్నికల్లో విజయం సాధించిన టిడిపి ప్రజా ప్రతినిధుల తీరు తెన్నులతో పాటు టిడిపి నేతల పనితీరుపై రహస్యంగా సర్వే నిర్వహిస్తున్నారు.సర్వే బృందాలు గుంటూరు జిల్లాలో పర్యటిస్తూ సాధారణ ప్రజలతో సంభాషిస్తోన్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలతో పాటు వివిధ నామినేటెడ్‌, పార్టీ పదవులు పొందిన నాయకుల పనితీరును అంచనావేస్తున్నాయి.

నాయకుల బలబాలపై ఆరా

నాయకుల బలబాలపై ఆరా

జిల్లాలోని పలువురు నాయకుల బలాలు, బలహీనతలు, అవ కాశాలు, దెబ్బతీసే అంశాల గురించి సమ గ్రంగా వివరాలు సేకరిస్తోన్నాయి. పార్టీకి విధేయుడిగా ఉంటోన్న సీనియర్‌ నాయ కులు, వాక్చాతుర్యం, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పని చేస్తోండటం, విద్యార్హతలు, నిర్వహణ సామర్థ్యాలు కలిగి ఉండటాన్ని నాయకుడి బలాలుగా తీసుకొంటున్నారు.

నాయకుల బలహీనతలపై

నాయకుల బలహీనతలపై

నేతల బలహీనతలపై కూడ సమాచారాన్ని సేకరిస్తోంది. అందరిని కలుపుకొని పోలేకపోవడం, ఒంటెద్దు పోకడ, గ్రూపు రాజకీయాలు చేయడం, ఆర్థికంగా బలహీనంగా ఉండ టం, నియోజకవర్గంలో చురుకుగా లేకపోవడం, ఖర్చుకు తటపటాయిస్తోం డటాన్ని బలహీనతలుగా ఈ బృందం అభిప్రాయపడుతోంది.

గ్రూపు తగాదాలపై దృష్టి

గ్రూపు తగాదాలపై దృష్టి

పార్టీ నేతల కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రజాప్రతినిధిగా ఉన్నా, రాజకీయ అనుభ వం, పార్టీ అధిష్టానంతో సత్సంబంధాలు కలిగి ఉండటం, స్థానిక ఇన్‌చార్జ్‌తో కలిసి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, వివిధ వర్గాల్లో పట్టు సాధించేందుకు కృషి చేయడం వంటి అంశాలను అవకాశాలుగా పరిగణిస్తోన్నారు. ఎమ్మెల్యేతో విభేదాలు, మండలంలోని నాయకులు, కార్యకర్తలతో మనస్పర్థలు, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడం లాంటి అంశాలను కూడ పరిశీలిస్తున్నారు. ఈ అంశాలన్నింటిని పొందుపర్చి నివేదికను తయారు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+