చంద్రబాబు-రేవంత్ భేటీ లైవ్-బొత్స డిమాండ్ కు టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్లు..!
కాసేపట్లో ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు-రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో సమావేశం కాబోతున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారంతో పాటు పలు ఇతర అంశాలపైనా ఇరు ముఖ్యమంత్రులు దృష్టిసారిస్తారు. ఇద్దరూ సీఎంలు అయ్యాక తొలిసారి భేటీ కానుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అదే సమయంలో వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వీరిద్దరి ముందు ఓ డిమాండ్ పెట్టారు.
విభజన సమస్యల పరిష్కారానికి ఇవాళ 2 రాష్ట్రాల సీఎంల సమావేశం నేపథ్యంలో పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న వార్తలు ఏపీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని బొత్స ట్వీట్ చేశారు. అంతే కాదు పారదర్శకతకోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తే బాగుంటుందని నా సూచన. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నానంటూ మరో ట్వీట్ కూడా పెట్టారు.

దీనిపై టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. భలే జోకులేస్తున్నారు బొత్స గారు..! పారదర్శకత గురించి మీరు.. జగన్ మాట్లాడితే నవ్విపోతారు.. వద్దులెండీ..? అంటూ ట్వీట్ చేశారు. అలాగే పారదర్శకతకు పాతరేసిందే మీరు.. మీ పార్టీ. ప్రెస్ మీట్లు కూడా లైవ్ కాకుండా ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో మీరు పని చేస్తున్నారు.. దయచేసి పారదర్శకత.. వాస్తవాలు వంటి పెద్ద పెద్ద పదాలు మీరు వాడొద్దని బొత్సకు సూచించారు.
1.విభజన సమస్యల పరిష్కారానికి ఇవాళ 2 రాష్ట్రాల CMల సమావేశం నేపథ్యంలో పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న వార్తలు AP ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
— Botcha Satyanarayana (@BotchaBSN) July 6, 2024
టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కూడా బొత్సకు చురకలు అంటించారు. ఆవేశపడకు బొత్సా... అక్కడ ఉంది జగన్ కాదు, చంద్రబాబు గారు.. మీ జగన్ రాగానే, ఏ చర్చలు లేకుండా, అప్పనంగా ఏపి భవనాలు అప్పగించింది మర్చిపోలేదు. ఢిల్లీలో ఏపి భవన్ ఇచ్చేస్తాం అని చెప్పిన మాటలు మర్చిపోలేదు.. బందర్ పోర్టులో వాటా ఇస్తాం అని చెప్పిన విషయం మర్చిపోలేదు..తాళాలు పగలగొట్టి ఎపీ ఆయుష్ భవనాన్ని స్వాధీనం చేసుకుంటే నోరు మూసుకున్న విషయం మర్చిపోలేదు.. పోలవరం నీళ్ళు కేసీఆర్ తీసుకుని వెళ్తాం అని చెప్పిన మాట మర్చిపోలేదన్నారు.
2.పారదర్శకతకోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తే బాగుంటుందని నా సూచన. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నాను.
— Botcha Satyanarayana (@BotchaBSN) July 6, 2024
పోలవరం ఎత్తు తగ్గించమని జగన్ కి చెప్పానని కేసీఆర్ చెప్పింది మర్చిపోలేదు.. కేసీఆర్ కాళ్ళ మీద విజయసాయి రెడ్డి పడిన విషయం మర్చిపోలేదు.అంటూ ట్వీట్లు చేశారు. చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏపి ప్రయోజనాల కోసమే పని చేస్తారు. సీనియర్ నేతగా రెండు తెలుగు రాష్ట్రాల బాగు కోసమే పని చేస్తారు.. మీ లాగా కేసులు కోసం, ఆస్తులు కాపాడుకోవలసిన పని ఆయనకు లేదన్నారు.
భలే జోకులేస్తున్నారు బొత్స గారు..! పారదర్శకత గురించి మీరు.. జగన్ మాట్లాడితే నవ్విపోతారు.. వద్దులెండీ..?
— Kinjarapu Atchannaidu (@katchannaidu) July 6, 2024
పారదర్శకతకు పాతరేసిందే మీరు.. మీ పార్టీ. ప్రెస్ మీట్లు కూడా లైవ్ కాకుండా ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో మీరు పని చేస్తున్నారు.. దయచేసి పారదర్శకత.. వాస్తవాలు వంటి పెద్ద…
టీడీపీ రియాక్షన్స్ పై బొత్స తిరిగి స్పందించారు. ప్రజల్లో నడుస్తున్న చర్చపై ప్రస్తావన చేశాను. నా సూచనను పరిగణలోకి తీసుకుంటారా? లేదా? అన్నది మీ ఇష్టం. ఏదిఏమైనా నా ట్వీట్‌కు రెస్పాండ్ అయినందుకు థాంక్స్ అంటూ స్పందించారు.
దీనిపైనా తిరిగి టీడీపీ నేతల నుంచి కౌంటర్లు పడుతున్నాయి.
ఆవేశపడకు బొత్సా..
— N Amarnath Reddy (@NAmaranathReddy) July 6, 2024
అక్కడ ఉంది జగన్ కాదు, చంద్రబాబు గారు..
మీ జగన్ రాగానే, ఏ చర్చలు లేకుండా, అప్పనంగా ఏపి భవనాలు అప్పగించింది మర్చిపోలేదు. ఢిల్లీలో ఏపి భవన్ ఇచ్చేస్తాం అని చెప్పిన మాటలు మర్చిపోలేదు.. బందర్ పోర్టులో వాటా ఇస్తాం అని చెప్పిన విషయం మర్చిపోలేదు..తాళాలు పగలగొట్టి 1/3 pic.twitter.com/gFoYugNCeB
చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏపి ప్రయోజనాల కోసమే పని చేస్తారు. సీనియర్ నేతగా రెండు తెలుగు రాష్ట్రాల బాగు కోసమే పని చేస్తారు.. మీ లాగా కేసులు కోసం, ఆస్తులు కాపాడుకోవలసిన పని ఆయనకు లేదు..3/3@BotchaBSN pic.twitter.com/HQyO5xyRfE
— N Amarnath Reddy (@NAmaranathReddy) July 6, 2024
ప్రజల్లో నడుస్తున్న చర్చపై ప్రస్తావన చేశాను. నా సూచనను పరిగణలోకి తీసుకుంటారా? లేదా? అన్నది మీ ఇష్టం. ఏదిఏమైనా నా ట్వీట్‌కు రెస్పాండ్ అయినందుకు థాంక్స్.
— Botcha Satyanarayana (@BotchaBSN) July 6, 2024












Click it and Unblock the Notifications