సభ్యత్వ నమోదులో టీడీపీ రికార్డ్

సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు దాదాపు 94 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 26వ తేదీన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత 63 రోజుల్లో ప్రతిరోజూ సగటున లక్షన్నర మంది సభ్యత్వం తీసుకున్నారు.

వాస్తవానికి ఈరోజు (31-12-2024)తో సభ్యత్వ నమోదు గడువు ముగిసినప్పటికీ పండుగ వరకు పొడిగించాల్సిందిగా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు వినతులు అందాయి. పార్టీ కేడర్ తో పాటు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో మరో 15రోజుల పాటు సభ్యత్వ నమోదు గడువు పెంచాలని అధిష్టానం నిర్ణయించింది.

TDP created history by enrolling 94 lakh members

గతానికి భిన్నంగా ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో దేశంలో మరెక్కడా లేనివిధంగా గత అయిదేళ్ళలో కార్యకర్తల సంక్షేమం కోసం రూ.138 కోట్లు ఖర్చు చేశారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ. 5లక్షల ప్రమాద భీమా సౌకర్యం కల్పిస్తున్నారు. సభ్యత్వ నమోదులో నెల్లూరు సిటీ మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం...
1). నెల్లూరు సిటీ - 1,46,966
2). పాలకొల్లు - 1,44,992
3). ఆత్మకూరు - 1,34,584
4). రాజంపేట - 1,29,783
5). కుప్పం - 1,28,496
6). ఉండి - 1,14,443
7). గురజాల - 1,08,839
8). వినుకొండ - 1,05,158
9). మంగళగిరి - 1,04,122
10). కళ్యాణ దుర్గం - 1,00,325
సభ్యత్వాలతో ముందు వరసలో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+