మోడీని ఆర్ధిక సహా ఆ మూడు శాఖలు కోరిన చంద్రబాబు-ముస్లిం రిజర్వేషన్లపై క్లారిటీ..!
దేశవ్యాప్తంగా తాజాగా వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కేంద్రంలో టీడీపీ అధినేత చంద్రబాబును కీలకంగా మార్చేశాయి. ముఖ్యంగా మిత్రపక్షాల సాయం లేకుండా ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు కష్టంగా మారిన నేపథ్యంలో ప్రధాని మోడీ ముందు టీడీపీతో పాటు జేడీయూ కీలక డిమాండ్లు పెడుతున్నాయి. ఇప్పటికే కేంద్రంలో కీలక మంత్రిత్వశాఖలతో పాటు స్పీకర్ పోస్టును కూడా అడుగుతున్న ఈ రెండు పార్టీలు.. ఇవాళ జరుగుతున్న ఎన్డీయే పక్షాల రెండో భేటీలో తమ డిమాండ్లను మరోసారి ప్రస్తావించాయి.
ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న ఎన్డీయే మిత్రపక్షాల రెండో భేటీలో టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రం ముందు పలు కీలక డిమాండ్లు ఉంచారు. ఇందులో కేంద్రంలో తమకు కీలకమైన ఆర్ధిక, ఐటీ, రవాణా శాఖలు ఇవ్వాలని బీజేపీ పెద్దల్ని కోరారు. అలాగే లోక్ సభ స్పీకర్ పదవి కూడా తమకు ఇవ్వాలని పట్టుబట్టారు. వీటితో పాటు ఏపీలో ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామని బీజేపీ పెద్దలకు తేల్చిచెప్పేశారు. దీంతో ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా వీటిపై చర్చిద్దామని చెప్పినట్లు తెలుస్తోంది.

#WATCH | Prime Minister Narendra Modi respectfully touches the Constitution of India with his forehead as he arrives for the NDA Parliamentary Party meeting.
— ANI (@ANI) June 7, 2024
Visuals from the Central Hall of the Samvidhan Sadan (Old Parliament). pic.twitter.com/JU6D9M0Jca
అలాగే ఎన్డీయేలో బీజేపీ, టీడీపీ తర్వాత మూడో అతిపెద్ద పార్టీ అయిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్ కూడా పలు డిమాండ్లను మోడీ, షా ముందు ఉంచారు. వీటిలో సైన్యంలో ఎంపికల కోసం తెచ్చిన అగ్నివీర్ పథకం రద్దు, దేశవ్యాప్త కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్రంలో తమకు కీలకమైన మూడు శాఖల్ని ఇవ్వాలని కోరారు. అయితే స్పీకర్ పోస్టుకు మాత్రం ఈసారి పట్టుబట్ట లేదని తెలుస్తోంది. కానీ ఎన్డీయే కన్వీనర్ పోస్టు తనకు ఇవ్వాలని నితీశ్ అడుగుతున్నారరాు.
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
చంద్రబాబుకు జాతీయ పార్టీ నేత సవాల్: మణిపూర్ లా తయారవుతాయి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications