అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీవారి ఆశీర్వాదం: 4న సభా పక్ష నేతగా బాబు ఎన్నిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జూన్ 4వ తేదీన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీ సభా నాయకుడిగా ఎన్నుకోనున్నారు. జూన్ 4న టిడిపి ఎమ్మెల్యేలు చిత్తూరు జిల్లా తిరుపతిలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో శాసన సభా పక్ష నేతను ఎన్నుకుంటారు.

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో క్యాంపస్‌లో జూన్ 4 (బుధవారం) టిడిపి శాసన సభ్యులు సమావేశమవుతారు. అప్పుడే చంద్రబాబును శాసన సభా పక్ష నేతగా ఎన్నుకుంటారు.

TDP to elect Chandrababu Naidu as legislature party leader on June 4

చంద్రబాబు నాయుడు విజయవాడ - గుంటూరు మధ్యలో ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జూన్ 8న సాయంత్రం 7.21 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఇప్పటికే చురుగ్గా పనులు జరుగుతున్నాయి.

జూన్ 4న శాసన సభా పక్ష నేతగా ఎన్నికయ్యాగ చంద్రబాబు ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు. జూన్ 5 (గురువారం) ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు.

English summary
The famous temple city of Tirupati is being decked up for the June 4 meeting of TDP MLAs, where N Chandrababu Naidu will be elected as the legislature party leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X