ఖాళీ ఎమ్మెల్సీ సీటు నుంచి మంత్రి నారాయణ

TDP to field Urban Development Minister for vacant Council seat
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణను నిలబెట్టాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. శాసన మండలిలో ఖాళీగా ఉన్న సీటుకు ఆగస్టు 21వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది.

ఎమ్మెల్సీ గానీ శాసనసభ్యుడు గానీ కానటువంటి నారాయణ విద్యా సంస్థల అధిపతి నారాయణను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రిగా నియమితుడైన నారాయణ నిబంధనల మేరకు ఆరు నెలల్లోగా ఏదో ఒక సభలో సభ్యుడు కావాలి.

మే 21వ తేదీన శాసన మండలికి కోలగట్ల వీరభద్ర స్వామి రాజీనామా చేయడంతో ఆ ఖాళీ ఏర్పడింది. ఆ స్థానం కోసం తెలుగుదేశం పార్టీలో పలువురు పోటీ పడుతున్నప్పటికీ నారాయణను శాసన మండలికి ఎన్నిక చేయించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే కోటాలో జరిగే ఈ ఉప ఎన్నికకు ఆగస్టు 4వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఆగస్టు 11వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాలి. ఉపసంహరణకు తుది గడువు ఆగస్టు 14వ తేదీ. అవసరమైతే 21వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాన్ని వెల్లడిస్తారు. అయితే, తెలుగుదేశం పార్టీకి శాసనసభలో మెజారిటీ ఉండడంతో నారాయణ ఎన్నిక నల్లేరు మీద బండి నడకేనని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+