వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓబుళాపురం చిన్నమ్మ:సుష్మపై టిడిపి, రాజధానిపై కోట్ల

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సోనియా గాంధీ ప్రధానమంత్రి అయితే గుండు గీయించుకుంటానని చెప్పిన బిజెపి నేత సుష్మా స్వరాజ్ ఆమెను పెద్దమ్మగా ఎలా పోల్చుతారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన సీమాంధ్ర నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమాంధ్రను తీర్చిదిద్దే శిల్పి చంద్రబాబు నాయుడే అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై పార్లమెంటులో ఎందుకు చర్చించరన్నారు. సీమాంధ్రకు ప్యాకేజీతో ఒరిగేది లేదన్నారు.

TDP fires at Sushma Swaraj

ఆ రెండు పార్టీల వెన్నుపోటు

ఎన్నికల అనంతరం కేంద్రంలో అధికారం ఏర్పాటు చేసే ఏ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ చుట్టూ తిరగాల్సిందేనని ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన సీమాంధ్ర నేతల సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్ర విభజన పాపం బిజెపి, కాంగ్రెస్ పార్టీలదే అన్నారు.

ఓబులాపురం చిన్నమ్మ

బిజెపి సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ఓబులాపురం చిన్నమ్మ అని బుచ్చయ్య చౌదరి అంతకుముందు ఎద్దేవా చేశారు. 20 ఎంపీ స్ధానాలు గెలుచుకుంటే ఏ పార్టీ అయినాసరే టిడిపి చుట్టూ తిరుగుతుందని ఆయన అన్నారు. సీమాంద్రులను పొమ్మనే హక్కు ఎవరికీ లేదన్నారు. సీమాంధ్ర ప్రజలను కాపాడుకునే శక్తి టిడిపికి ఉందని, సీమాంద్ర ప్రాంతానికి పదేళ్ళపాటు ప్రత్యేక కేటగిరీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాజధానిపై మాగుంట లేఖ

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఏర్పాటుపై ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. ఎపికి రాజధానిగా ఒంగోలు పేరును ప్రకటించాలని కోరారు. ఇక, ప్రస్తుత పరిణామాల దృష్ట్యా కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడం శ్రేయస్కరం కాదని లేఖలో పేర్కొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడం శ్రేయస్కరం కాదన్నారు.

కర్నూలును చేయాలని కోట్ల

ఎపికి కర్నూలను రాజధానిని చేయాలని కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏకపక్షంగా జరిగిన విభజనకు బిజెపి మాటమాత్రంగానైనా అడ్డు చెప్పలేదన్నారు. రాష్ట్ర విభజన పాపంలో బిజెపికి భాగస్వామ్యముందన్నారు.

English summary
Telugudesam Party senior leaders lashed out at BJP senior leader Sushma Swaraj for supporting AP divide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X