టీడీపీ సీనియర్ల వారసులకు జెడ్పీ ఛైర్మన్ పీఠాలు కేటాయింపు- వారికి నిరాశ..!!
టీడీపీ జెడ్పీ ఛైర్మన్ల జాబితా ప్రకటించింది. సుదీర్ఘ చర్చల తరువాత అర్ద్రరాత్రి అభ్యర్ధులను ఖరారు చేసారు. నాలుగు జిల్లాలు జనసేనకు, ఒకటి బీజేపీకి కేటాయించారు. 22 జిల్లాల జెడ్పీ ఛైర్మన్లను జాబితాను వెల్లడించారు. పలు జిల్లాల్లో సీనియర్ల వారసులకు జెడ్పీ పీఠాలు దక్కాయి. పలువురు సీనియర్ నేతలు తమ వారసుల కు జెడ్పీ పీఠం కోసం చివరి వరకు ప్రయత్నించారు. అయితే, కొందరికి మాత్రం ఈ పదవులు దక్కాయి.
టీడీపీ 22 జిల్లాల జెడ్పీ ఛైర్మన్ అభ్యర్ధులను ప్రకటించింది. అందులో పలువురు సీనియర్ నేతల వారసులకు పదవులు దక్కాయి. కూటమిలోని జనసేన, బీజేపీ తో సీట్ల సర్దుబాటు పై అర్ద్రరాత్రి వరకు చర్చలు జరిగాయి. జనసేన ఆరు సీట్ల కు పట్టుబట్టగా చివరగా నాలుగు సీట్లు కేటాయింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా కడప జెడ్పీ కోసం బీజేపీ నాయకత్వం కోరింది. చివరి నిమిషం వరకు ప్రయత్నించింది. అయితే.. అనూహ్యంగా క్రిష్ణా జిల్లా జెడ్పీ బీజేపీకి కేటాయింపు తో మిగిలిన 22 సీట్లు టీడీపీకి దక్కాయి. విజయనగరం జడ్పీ చైర్మన్ గా చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర ను ఎంపిక చేసారు. టీడీపీలో చేరే సమయంలో ఇచ్చిన హామీ మేరకు కేటాయించారు. అదే విధంగా సత్యసాయి జెడ్పీ పీఠం కోసం జనసేన ప్రయత్నం చేసింది. చివరకు పరిటాల శ్రీరామ్ పేరు ప్రకటించారు. ఏలూరు జడ్పీ చైర్మన్ గా ఎమ్మెల్యే చింతమనేని కుమార్తె సాయి నవ్యశ్రీ పేరు అధికారికంగా వెల్లడించారు.

వారసులకు ఏరి కోరి ఎంపిక
తిరుపతి పార్లమెంటు కోసం పలువురు నేతలు ప్రయత్నించారు. చివరకు సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత కు జెడ్పీ సీటు కేటాయించారు. ఆమె నాగులాపురం జెడ్పీటీసీగా ఎన్నికల్లో విజయం సాధించారు. మార్కాపురం జిల్లా జెడ్పీ ఛైర్మన్ గా నారాయణరెడ్డి సోదరుడు రామిరెడ్డికి కేటాయించారు. కడప జిల్లా జెడ్పీ పీఠం అనేక తర్జన భర్జనల తరువాత ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి తండ్రి నరసింహారెడ్డికి దక్కింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ గా గొల్లపల్లి అమూల్య కు కేటాయించారు. పోలవరం జెడ్పీ ఛైర్ పర్సన్ గా 2014 లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్లిన వంతల రాజేశ్వరికి ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ జెడ్పీలు జనసేనకు కేటాయించారు.












Click it and Unblock the Notifications
