YCP కంచుకోటపై TDP 'ముందస్తు' వ్యూహం!

ఉమ్మడి కర్నూలు జిల్లా అంటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటింది. అందులోను ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ లో వైసీపీ ఇంకా బలంగా ఉంది. ఆర్థిక మంత్రిని ఢీకొట్టాలంటే ఆర్థిక బలం, అంగ బలం ఒక్కటే సరిపోదు.. 'లెక్కలు' కూడా సరిగ్గా తెలిసుండాలి. అప్పుడే ఆయన్ని ఓడించడానికి చిన్న ప్రయత్నం జరిగినట్లుగా భావించవచ్చు

 వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించిన బుగ్గన

వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించిన బుగ్గన

2014, 19 వరుస ఎన్నికల్లో వైసీపీ తన సత్తాను చాటుతూనే ఉంది. వరుసగా రెండుసార్లు బుగ్గన విజయకేతనం ఎగరవేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున అనూహ్యంగా సుబ్బారెడ్డిని ఇన్ ఛార్జిగా చంద్రబాబు నియమించారు. ఎన్నికలకు రెండు సంవత్సరాల సమయం ఉంది కదా అనుకుంటున్న తరుణంలో చంద్రబాబు తన స్వభావానికి విరుద్ధంగా ఇక్కడ ఎన్నికల్లో తలపడబోయేది సుబ్బారెడ్డే అంటూ తేల్చిచెప్పారు. ప్రజల సమక్షంలోనే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.

సుబ్బారెడ్డి రాకతో మారిన రాజకీయం

సుబ్బారెడ్డి రాకతో మారిన రాజకీయం


సుబ్బారెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ రాజకీయం మారుతూ వస్తోంది. అన్ని మండలాల్లో, గ్రామాల్లో వైసీపీ పటిష్టంగా ఉంది. అయితే సుబ్బారెడ్డి అలుపెరగకుండా పనిచేస్తుండటంతో ఇక్కడ టీడీపీ కొంత పుంజుకుంది. పట్టణ ప్రాంతాల్లో సైకిల్ కు ఆదరణ కనపడుతోంది. నియోజకవర్గ పరిధిలో ఉన్న 45 గ్రామాల్లో 25కుపైగా గ్రామాల్లో వైసీపీ ఆధిపత్యం ఉంది. డోన్ పట్టణం అభివృద్ధి చెందినా పల్లెలు వెనకబడటంతో సుబ్బారెడ్డి తాను గెలిస్తే గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని అక్కడి ప్రజలకు హామీ ఇస్తున్నారు.

 ఇరువర్గాలను మచ్చిక చేసుకుంటున్న సుబ్బారెడ్డి

ఇరువర్గాలను మచ్చిక చేసుకుంటున్న సుబ్బారెడ్డి


సుబ్బారెడ్డి నిత్యం ప్రజల్లోనే ఉంటుండటంతో టీడీపీ శ్రేణుల్లో కదలిక వచ్చింది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుండటంతో తక్కువ కాలంలోనే పేరు సంపాదించుకున్నారు. బేతంచెర్లతోపాటు 15 గ్రామాల్లో టీడీపీకి బలం ఉంది. వాస్తవానికి డోన్ లో మొదటి నుంచి రెండు వర్గాలు పనిచేస్తున్నాయి. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వర్గంతోపాటు కేఈ కృష్ణమూర్తి వర్గాలున్నాయి. ప్రస్తుతం కోట్ల వర్గాన్ని మచ్చిక చేసుకున్న సుబ్బారెడ్డి కేఈ వర్గాన్ని కూడా కలుపుకొని పోవడానికి ప్రయత్నాలు ఆరంభించారు. అన్నివర్గాలను కలుపుకొని టీడీపీ తరఫున రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తాననే ధీమాను సుబ్బారెడ్డి వ్యక్తపరుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+