కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అడక్కపోయినా: జగన్‌ను అలా దెబ్బతీసేందుకు 'పులివెందుల' ప్లాన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సందర్భం వచ్చినప్పుడల్లా టిడిపి నేతలు విరుచుకుపడుతున్నారు. కడప జిల్లా, పులివెందుల అభివృద్ధిపై కూడా మాట్లాడుతున్నారు

|
Google Oneindia TeluguNews

విజయనగరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సందర్భం వచ్చినప్పుడల్లా టిడిపి నేతలు విరుచుకుపడుతున్నారు. కడప జిల్లా, పులివెందుల అభివృద్ధిపై కూడా మాట్లాడుతున్నారు.

బాబు ఇంట్లో కలుస్తా: 'టిడిపిలో చేరిక'పై లగడపాటి ట్విస్ట్, భావోద్వేగాలపై..బాబు ఇంట్లో కలుస్తా: 'టిడిపిలో చేరిక'పై లగడపాటి ట్విస్ట్, భావోద్వేగాలపై..

పులివెందులపై..

పులివెందులపై..

పులివెందులకు నీరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీరు ఇస్తానంటే జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని టిడిపి నేతలు మండిపడుతున్నారు. తాజాగా లోకేష్ మరోసారి ప్రతిపక్ష నేతపై మండిపడ్డారు.

జగన్ అడకపోయినా రూ.10 కోట్లు మంజూరు

జగన్ అడకపోయినా రూ.10 కోట్లు మంజూరు

ఆయన విజయనగరం జిల్లాలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వం హయాంలో ఎలాంటి పక్షపాతం లేదని తేల్చి చెప్పారు. నియోజకవర్గ నిధులు కావాలని జగన్ అడగకపోయినా రూ.10 కోట్లు మంజూరు చేశామని చెప్పారు.

జగన్ 'మొదలు' నరికే యోచన

జగన్ 'మొదలు' నరికే యోచన

వైయస్ కుటుంబానికి కడప జిల్లాలో మంచి పట్టు ఉంది. ముఖ్యంగా పులివెందులలో వారి కుటుంబానికి తిరుగులేదు. ఈ నేపథ్యంలో 2019లో మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న టిడిపి.. జగన్‌కు సొంత ఇలాకాలోనే షాకివ్వాలని భావిస్తోంది.

పులివెందుల టార్గెట్

పులివెందుల టార్గెట్

పులివెందుల అభివృద్ధితో పాటు, అక్కడి నాయకులపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దృష్టి సారించింది. టిడిపిలోకి వస్తానని చెప్పే వారికి వెల్‌కంకు సిద్ధంగా ఉంది.

జగన్‌కు ఇలా కౌంటర్

జగన్‌కు ఇలా కౌంటర్

అంతేకాదు, టిడిపిలో చేరిన వైసిపి ఎమ్మెల్యేల గురించి జగన్ లేదా వైసిపి నేతలు నిలదీస్తే.. జగన్‌కు ఉప ఎన్నికలు కావాలని అంతగా ఇష్టం ఉంటే పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, తన బలం మరోసారి నిరూపించుకోవాలని సవాల్ చేస్తున్నారు. తద్వారా జగన్‌ను ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
Telugu Desam Party is targetting YSR Congress Party chief YS Jaganmohan Reddy with Pulivendula development issue. Nara Lokesh on Wednesday said that TDP government is released Rs 10 crore funds for Pulivendula development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X