కూటమిలో మేయర్ సీట్లు ఎవరికి ఎక్కడ - లిస్టులో..!!

ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దమైంది. సుప్రీంలో బీసీ రిజర్వేషన్ల పై నిర్ణయం వెలువడిన వెంటనే మున్సిపల్ పోల్స్ షెడ్యూల్ విడుదల కానుంది. ఈ దిశగా తుది కసరత్తు కొనసాగుతోంది. అటు కూటమి.. ఇటు వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు.. సమన్వయం పైన చర్చలు జరుగుతున్నాయి. జనసేన కోరుకుంటున్న మేయర్ సీట్ల పైన సీఎం చంద్రబాబు కు పవన్ జాబితా అందించారు. కాగా.. మూడు పార్టీల మధ్య మేయర్ సీట్ల పంపకాల పైన తుది కసరత్తు జరుగుతోంది.

ఈ నెలాఖరులోగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. రేపు (శుక్రవారం) లేదా 12వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. కాగా.. ముందుగా మున్సిపల్ ఎన్నికల పైన ప్రకటన రానుంది. దీంతో.. కూటమి పార్టీలు మేయర్, మున్సిపల్ ఛైర్మన్ సీట్ల పైన ప్రతిపాదనల ను సిద్దం చేసారు. సీఎం చంద్రబాబుతో పవన్ సమావేశంలో తమ పార్టీ కోరుకుంటున్న స్థానాల పైన జాబితా అందించినట్లు సమాచారం. విశాఖ, విజయవాడ, తిరుపతి స్థానాల పైనే ప్రధానంగా మూడు పార్టీల మధ్య నిర్ణయం జరగాల్సి ఉంది. ఈ సీట్లను మూడు పార్టీలు కోరుకుంటున్నాయి. అయితే, బీజేపీ విశాఖ పైన పట్టుబడుతోంది. కాగా.. బీజేపీకి రాజమండ్రి, తిరుపతి ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. కాగా.. విజయవాడ, ఏలూరు, ఒంగోలు, కాకినాడ, మచిలీపట్నం స్థానాలను జనసేన కోరుతున్నట్లు తెలుస్తోంది.

స్థానిక ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్, షెడ్యూల్..!!
స్థానిక ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్, షెడ్యూల్..!!
tdp-jana-sena-and-bjp-strategies-over-mayor-seats-co-ordination-team-to-finalize-here-the-report

తుది కసరత్తు

అయితే, కాకినాడ.. మచిలీపట్నం, ఏలూరు, విజయనగరం స్థానాలు జనసేనకు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒంగోలు.. నెల్లూరు పైనా టీడీపీ- జనసేన మధ్య తేలాల్సి ఉంది. కాగా.. జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మున్సిపాల్టీలతో పాటుగా విశాఖ, ఉభయ గోదావరి- ఎస్టీ నియోజకవర్గాల్లో తమకు మున్సిపాల్టీలు కేటాయించాలని జనసేన కోరుతోంది. బీజేపీ తమకు మేయర్ స్థానాలు తగ్గిస్తే జిల్లా పరిషత్ స్థానాలు పెంచాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. మేయర్ ఎన్నిక ప్రత్యక్ష విధానంలో జరగనుండటంతో... పార్టీ నుంచి ప్రతిపాదిస్తున్న అభ్యర్ధుల వ్యవహారం కూటమిలో కీలకంగా మారుతోంది. కాగా.. వైసీపీ కూడా మేయర్ స్థానాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నెల్లూరు నుంచి ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఒకవేళ రిజర్వేషన్ మారితే అభ్యర్థిని మార్చాలని నిర్ణయించింది. కూటమి సమన్వయ కమిటీ ఈ రోజు సమావేశం కానుంది. రిజర్వేషన్ల ఆధారంగా తుది జాబితా ఖరారు చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+