రాజ్యసభ హామీ నెరవేరలేదు, నిస్వార్దంగా పని చేసినా..!!
టీడీపీ సీనియర్ నేత రెడ్డపగారి శ్రీనివాసరెడ్డి రాజ్యసభ సీట్ల కేటాయింపు పై స్పందించారు. టీడీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులను ప్రకటించారు. జనసేన కు ఒక సీటు దక్కింది. రాజ్యసభ సీట్లు ఆశించిన వారిలో శ్రీనివాస రెడ్డి ఉన్నారు. ఆయనకు సీటు దక్కకపోవటంతో.. పార్టీ నేతలు నేరుగా మాట్లాడి బుజ్జగించారు. అయినా.. శ్రీనివాస రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.
టీడీపీలో రాజ్యసభ సీట్ల కేటాయింపు పైన కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత రెడ్డపగారి శ్రీనివాస రెడ్డి స్పందించారు. రాజ్యసభ సీట్ల ఆశావాహుల్లో ఆయన ఉన్నారు. టీడీపీ నుంచి మగ్గురుని ఖరారు చేసారు. భాష్యం రామక్రిష్ణ, సానా సతీశ్, చింతకాయల అయ్యన్న పాత్రుడిని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దీంతో, సీట్లు దక్కని నేతలతో పార్టీ ముఖ్యులు నేరుగా మాట్లాడారు. వారిని బుజ్జగించే ప్రయత్నం చేసారు. రెడ్డపగారి శ్రీనివాసరెడ్డి, టీడీ జనార్ధన్, కంభంపాటి రామ్మోహన రావు తో పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు మాట్లాడినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల్లో భాగంగానే ఈ ముగ్గురిని ఎంపిక చేసినట్లు నచ్చ చెప్పారు. కాగా, తనకు రాజ్యసభ సీటు దక్కకపోవటం పైన కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసారు.

శక్తి మేరకు కృషి చేస్తూనే ఉంటాను..
https://twitter.com/ReddeppagariSVR/status/2063499196456726945శ్రీనివాస రెడ్డి చేసిన పోస్టులో.." గత 13 సంవత్సరాలుగా కడప లాంటి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉన్న జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ, పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశాను. రాజకీయ, ఆర్థిక, మానసిక, శారీరక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీ జెండా ఎప్పటికీ ఎగురుతూ ఉండాలనే సంకల్పంతో పని చేశాను. పార్టీ అధిష్టానం నాకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేరకపోవడం వ్యక్తిగతంగా ఎంతో కలతకు గురి చేసింది. పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన నాయకులను, కార్యకర్తలను తగిన సమయంలో గుర్తించకపోవడం బాధాకరం. ముఖ్యంగా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం నా రాజకీయ జీవితంలో అత్యంత నిరాశ కలిగించిన సంఘటనగా మిగిలిపోతుంది. కార్యకర్తల కోసం, ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం నా శక్తి మేరకు కృషి చేస్తూనే ఉంటాను.." అని పేర్కొన్నారు. పార్టీలో ఇప్పుడు ఈ పోస్టు వైరల్ అవుతోంది.













Click it and Unblock the Notifications