రాళ్లతో ఎవర్ని కొట్టాలి, నీ ఎస్టేట్ లేదనేనా: జగన్‌పై టీడీపీ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ శుక్రవారం మండిపడింది. రైతుల రుణమాఫీపై వైయస్ జగన్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాళ్లతో కొట్టాలని జగన్ పిలుపు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.
రూ.లక్ష కోట్లు దోచిన జగన్‌ను వదిలేసి, రూ. 45 వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన చంద్రబాబును ఎందుకు రాళ్లతో కొట్టాలో చెప్పాలన్నారు. ఇడుపులపాయ ఎస్టేట్‌కు రుణమాఫీ వర్తించలేదని జగన్ ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల రుణమాఫీ హామీ అడ్డగోలు హామీయా అని ప్రశ్నించారు.

జగన్‌కు రైతులంటే లెక్క లేదన్నారు. చంద్రబాబు మీద కోపంతో, అధికారంలోకి రాలేదని కోపంతో రైతులను అవమానిస్తూ, రుణమాఫీనే విమర్శిస్తారా అని ధ్వజమెత్తారు.
న్యాక్‌కు డైరెక్టర్లను నియమించిన తెలంగాణ రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు
హైదరాబాదు కొండాపూర్‌లో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (న్యాక్)కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు డైరెక్టర్లను నియమించాయి. ఈ రెండు ప్రభుత్వాలు న్యాక్‌కు చెరో డైరెక్టరును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశాయి. శుక్రవారం ఐఏఎస్ అధికారి శ్యాంబాబు బాధ్యతలు చేపట్టేందుకు న్యాక్ కార్యాలయానికి వచ్చారు.
అయితే, ఆయనకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ‘శ్యాంబాబు గో బ్యాక్' అంటూ వారు నినాదాలు చేశారు. దీంతో, ఆయన పోలీసుల సూచన మేరకు తిరిగి వెళ్లిపోయారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్‌లు చెరో డైరెక్టర్‌ను నియమించాయి.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ!












Click it and Unblock the Notifications