టీడీపీ మ్యానిఫెస్టోపై సాయిరెడ్డి ట్వీట్లకు అయ్యన్న ఘాటు కౌంటర్...
ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న టీడీపీ తాజాగా రాజమండ్రిలో మహానాడు సందర్భంగా మినీ మ్యానిఫెస్టో విడుదల చేసింది. ఈ మినీ మ్యానిఫెస్టోపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపుకు ఈ మ్యానిఫెస్టో పనికొస్తుందని టీడీపీ నేతలు చెప్తుంటే, అధికార వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు మ్యానిఫెస్టోను నమ్మలేం అంటున్నారు. ఇదే క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రోజూ టీడీపీ మ్యానిఫెస్టోను మాయఫెస్టో అంటూ ట్వీట్లు పెడుతున్నారు.
టీడీపీ మినీ మ్యానిఫెస్టోపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పెడుతున్న ట్వీట్లపై టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇవాళ ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ లోనే సాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. సాయి రెడ్డిది ఉనికి సమస్య అన్న అయ్యన్న, టీడీపీ మానిఫెస్టో తో వైసీపీ మాయం అవ్వడం ఖాయమన్నారు. ఎంపీ సాయిరెడ్డికి పార్టీలో ఉనికి సమస్య మొదలైనట్లు ఉంది. చాలా రోజుల తరువాత పార్టీ ఆఫీస్ కు వచ్చిన సాయిరెడ్డి టీడీపీ మేనిఫెస్టో పై విమర్శలు చేసి జగన్ దృష్టిలో పడేందుకు నానా పాట్లు పడుతున్నారని అయ్యన్న విమర్శించారు.

మహానాడులో తెలుగుదేశం ఇచ్చిన మొదటి ఫేజ్ మేనిఫెస్టో వైసీపీ నేతలకు నిద్రలేకుండా చేస్తుందని రోజూ వాళ్ల ఉలిక్కిపాటు చూస్తేనే అర్థం అవుతుందని అయ్యన్న తెలిపారు. రూ.2 కిలో బియ్యం వంటి కొత్త పథకాలు, మహిళలకు ఆస్తిహక్కు వంటి నిర్ణయాలు, ప్రజల వద్దకు పాలన వంటి సంస్కరణలు, జన్మభూమి వంటి కార్యక్రమాలు, విజన్-2020తో ప్రజల బతుకులు మార్చిన ఆలోచనలు చేసిన తెలుగుదేశం పార్టీ ఎవరినీ కాపీ కొట్టాల్సిన అవసరం లేదని మీరు, మీ పేటీఎం గాళ్లు తెలుసుకోవాలంటూ అయ్యన్న ఘాటు విమర్శలు చేశారు.

What CBN thinks today...nation thinks tomorrow. దేశం రేపు చేసే ఆలోచనను....మా అధినేత చంద్రబాబు నేడు ఆలోచించి అమలు చేస్తారంటూ అయ్యన్న వివరించారు. అదీ ఆయన గట్స్...విజన్. 4 దశాబ్దాల తెలుగుదేశం తెచ్చిన పాలసీలను తర్వాత దేశం ఫాలో అయ్యిందన్న విషయం నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన మీకు ఎలా తెలుస్తుందిలే! అంటూ సాయిరెడ్డిని టార్గెట్ చేశారు. మేం ప్రకటించింది మాయా ఫెస్టో కాదు, ఏపీ రాజకీయాల నుంచి వైసీపీని మాయం చేసే తిరుగులేని మేనిఫెస్టో అన్నారు.
. @VSReddy_MP https://t.co/0eVEsAO2nM pic.twitter.com/XgtVicZ3Do
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) June 8, 2023
సాయిరెడ్డీ...మీరు చెప్పిన దాంట్లో ఒక్కటి మాత్రం నిజం ఉంది, అందరినీ అన్నివేళలా ఎవరూ మోసం చేయలేరు. ఒక్క ఛాన్స్ తో మీరు చేసిన మోసాన్ని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా మళ్లీ ప్రజలను మోసం చెయ్యలేరంటూ అయ్యన్న తన ట్వీట్ ముగించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications