అల్లు అర్జున్‌తో గంటా- టాలీవుడ్‌పై ఆ ముద్ర..!!

అమరావతి: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప- ది రైజ్ సినిమాలో చూపిన నటనకు ఆయనకు ఈ అవార్డు వరించింది. ఈ సినిమాలో గంధపు చెక్కల వర్కర్‌గా, స్మగ్లర్‌గా విశ్వరూపాన్ని ప్రదర్శించారు.

అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా నామినేట్ కావడం పట్ల టాలీవుడ్ స్పందిస్తోంది. ఆయనను అభినందిస్తూ పెద్ద ఎత్తున ట్వీట్లు పోస్ట్ చేస్తోన్నారు తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దలు. నటులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు.. ఇలా చాలామంది సినీ పెద్దలు అల్లుకు విషెస్ తెలియజేస్తోన్నారు.

TDP leader Ganta Srinivas greets to Allu Arjun

అటు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ బంగళా బ్లెస్సింగ్స్ వద్ద కూడా సందడి నెలకొంది. ఆయనకు అవార్డ్ వచ్చిందనే విషయం తెలుసుకున్న వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున ఇంటికి చేరుకుంటోన్నారు. బాణాసంచా పేల్చుతూ సంబరాలు జరుపుకొంటోన్నారు. పుష్ప బ్యానర్లను ప్రదర్శిస్తోన్నారు.

అల్లు అర్జున్‌కు విషెస్ తెలిపిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. కంగ్రాచ్యులేషన్స్ అల్లు అర్జున్ బావా, పుష్ప ఘన విజయం సాధించడంలో, అవార్డులను సాధించడంలో అన్ని అర్హతలు ఉన్నాయంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.

TDP leader Ganta Srinivas greets to Allu Arjun

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కూడా అల్లు అర్జున్‌ను కలిసి విషెస్ తెలిపారు. జాతీయ అవార్డుల ప్రకటన తరువాత ఆయన నేరుగా అల్లు అర్జున్ ఇంటికి బయలుదేరి వెళ్లారు. పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ అవార్డు రావడం ఎంతో ఆనందం కలిగించిందని అన్నారు.

మొట్టమొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక హీరోకి ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు రావడం ఎంతో ఆనందదాయకమని, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అనేక అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకే కావాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+