'మీకన్నా జగనే మేలు కదరా'..కూటమిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్

రాష్ట్ర రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ తీరే సపరేటు. వాళ్లు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని ఇరాకటంలోకి నెట్టడం వారికి మొదటి నుంచి అలవాటు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న జేసీ బ్రదర్స్ తర్వాత , టీడీపీలో కొనసాగుతున్నారు. గత టీడీపీ హయంలో సొంత ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. టీడీపీ కూటమి మరోసారి అధికారంలోకి రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైనశైలిలో స్పందిస్తున్నారు. మద్యం సిండికెట్‌లో తనకు 2 శాతం వాటా చెల్లించాలని బహిరంగంగానే తెలిపారాయన.

అయితే అలా వచ్చిన డచ్చులను తాడిపత్రి అభివృద్దికే ఉపయోగిస్తానని ఆయన తెలిపారు. ఆ మధ్య రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారులను బెదరిస్తోన్న వీడియోలు సైతం బయటకు వచ్చాయి. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో జేసీ ప్రభాకర్ రెడ్డి వైరం పెట్టుకున్నారు. వెట్ ఫ్లై యాష్ దందా విషయంలో ఇరు నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. రోజుకు రూ.5 లక్షల రూపాయిల వరకు ఆదాయం వస్తుండటంతో ఇరు నేతలు వెట్ ఫ్లై యాష్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. ఈ పంచాయితీ సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. ఆయ‌న జేసీ, ఆదినారాయ‌ణ‌రెడ్డిల‌ను స్వ‌యంగా అమ‌రావ‌తికి కలవాలని తెలిపారు.

TDP leader JC Prabhakar Reddy praises Jagan on bus fire incident

చంద్ర‌బాబు పిలుపుతో ఆది నారాయ‌ణ‌రెడ్డి అమ‌రావ‌తికి వ‌చ్చారు. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి మాత్రం ఈ భేటీకి డుమ్మా కొట్టారు. తాజాగా జేసీ ట్రావెల్స్ బస్సులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు.అందులో ఒకటి పూర్తిగా దగ్ధమైంది. మరో మూడు పాక్షికంగా కాలిపోయాయి.ఈ ఘటనపై జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైనశైలిలో స్పందించారు.నా బస్సులు కాల్చారు. అయితే ఏమౌతుంది.. కనీసం నేను ఫిర్యాదు కూడా చేయనని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.మీకన్నా జగనే మేలు కదరా అంటూ సొంత ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. జగన్ కేవలం బస్సులు తిరగ్గకుండా మాత్రమే ఆపారని, కానీ మీ బీజేపీ ప్రభుత్వంలో బస్సులు తగులబెట్టించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంతకన్నా నీచం మరోకటి లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.బస్సులు కాల్చి ఏం సాధించారని జేసీ ఈ సందర్భంగా ప్రశ్నించారు. మీకంటే జగనే మంచోడు.. జగన్ బస్సులు ఎప్పుడు కాల్చలేదని, కేవలం బస్సులను నిలబెట్టించాడని జేసీ తెలిపారు.ఈ బస్సులను డ్రైవర్లకు ఇచ్చేశానని, వారి కడుపు కొట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 4 కోట్ల రూపాయిలతో దేవాలయాల అభివృద్దికి ఖర్చు చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. తమ బస్సుల దగ్దం వెనుక బీజేపీ నేతలున్నారని జేసీ బలంగా నమ్మినట్టు ఉన్నారని, అందుకే ఆయన బీజేపీ నేతలపై ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటారని టీడీపీ నేతలు భావిస్తున్నారు.ఏదైన జగన్ మీకంటే మంచోడని జేసీ చెప్పడం ఇప్పుడు ఏపీ రాజకీయా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+